బ్యాంగ్ బ్యాంగ్: హృతిక్-కత్రినా వావ్ మూమెంట్స్ (ఫోటోస్)
హైదరాబాద్: హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా బాలీవుడ్లో 'బ్యాంగ్ బ్యాంగ్' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్లో టామ్ క్రూయిజ్-కామెరూన్ డియాజ్ నటించిన 'నైట్ అండ్ డే' చిత్రానికి ఇది రీమేక్. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకు ముందు హృతిక్ నటించిన క్రిష్ చిత్రం తెలుగు, తమిళంలో మంచి వసూళ్లు సాధించడంతో....'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాన్ని కూడా తెలుగు తమిళంలో విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీన ఈచిత్రం విడుదల కాబోతోంది.
కాగా...ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన 'తూ మేరీ' సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సాంగులో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ మధ్య వచ్చే కొన్ని మూమెంట్స్ వావ్ అనే విధంగా ఉన్నాయి.
స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వివారాలు...

మూమెంట్ నెం.1
‘తు మేరా' సాంగులో బీట్ కు తగిన విధంగా స్టెప్పులేస్తున్న హృతిక్ రోషన్, కత్రినా కైఫ్

మూమెంట్ నెం.2
హృతిక్ రోషన్ గ్రీక్ లుక్, ఆటిట్యూడ్ ఈ సినిమాలో మరింత బెస్ట్ గా ఉండనున్నాయి.

మూమెంట్ నెం.3
ఈ పాటలో కత్రినా కైఫ్ బార్బీడాల్ లుక్‌తో ఆకట్టుకోబోతోంది.

మూమెంట్ నెం.4
ఈ సాంగులో బ్యాగ్రౌండ్ డిజైనింగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. వెరసి ఈ పాట చూస్తున్న ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇస్తోంది.

మూమెంట్ నెం. 5
ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. రొమాంటిక్ లుక్స్ బాగున్నాయి.

మూమెంట్ నెం.6
డాన్స్ పెర్ఫార్మెన్స్ పరంగా హృతిక్ రోషన్ ఈ పాటలో అదరగొట్టారు.

మూముంట్ నెం.7
ఈ పాట చిత్రీకరణ బ్యాక్ డ్రాపులో ఫైర్ ఎగ్జిబిట్ కూడా కేక పుట్టించే విధంగా ఉంది. ఒక రకంగా ఈ సాంగ్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు.

మూమెంట్ నెం.8
ఈ సాంగులో కత్రినా కైప్, హృతిక్ రోషన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపించారు.

మూమెంట్ నెం. 9
కత్రినా కైఫ్, హృతిక్ రోషన్ మధ్య సిజ్లింగ్ కెమిస్ట్రీ సాంగుకు పర్ ఫెక్ట్ నెస్ తెచ్చింది.

మూమెంట్ నెం.10
ఈ పాటలో హృతిక్ డాన్స్ చేస్తుండగా వెనక వైపు కనిపించే ఫైర్ వర్క్స్ ఎపెక్ట్ అంద్భుతంగా ఉంది.


Click it and Unblock the Notifications











