సీన్ టు సీన్...మక్కీకి మక్కీ దించేసారు (ఫోటోస్)
హైదరాబాద్: హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా బాలీవుడ్లో 'బ్యాంగ్ బ్యాంగ్' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్లో టామ్ క్రూయిజ్-కామెరూన్ డియాజ్ నటించిన 'నైట్ అండ్ డే' చిత్రానికి ఇది రీమేక్. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే....'నైట్ అండ్ డే' చిత్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా బాలీవుడ్లో 'బ్యాంగ్ బ్యాంగ్' పేరుతో రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరో వేసుకునే డ్రెస్సు కలర్, కారు ఇలా ప్రతిదీ సీన్ టు సీన్ మక్కీకి మక్కీ దించేస్తున్నారు. ఎలాగూ రీమేక్ సినిమానే కాబట్టి ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా... బ్యాంగ్ బ్యాంగ్ ట్రైలర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పింది. విడుదలైన 13 గంటల్లోనే యూట్యూబులో 1 మిలియన్ మార్క్ దాటింది. ఒక రోజు పూర్తయ్యే సరికి ఏకంగా 25 లక్షల మంది ఈ ట్రైలర్ వీక్షించారు. ఇండియన్ ఫిల్మ్ చరిత్రలోనే ఈ రికార్డ్. తాజాగా జులై 22న ఈ ట్రైలర్ విడుదల కాగా....తాజాగా 5 మిలియన్ల మార్కును దాటింది.
ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతకు ముందు హృతిక్ నటించిన క్రిష్ చిత్రం తెలుగు, తమిళంలో మంచి వసూళ్లు సాధించడంతో....'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాన్ని కూడా తెలుగు తమిళంలో విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీన ఈచిత్రం విడుదల కాబోతోంది.

బైక్ సీన్
ఇక్కడ కనిపిస్తున్నది సినిమాలోని ఫేమస్ యాక్షన్ బైక్ సీన్. సీన్ టు సీన్ దించేసారు.

కార్ సీన్...
‘బ్యాంగ్ బ్యాంగ్' సినిమాలోని కార్ సీన్ కూడా ‘నైట్ అండ్ డే' సినిమాలో ఉన్నట్టుగానే చిత్రీకరించారు.

రూప్ జంప్
హీరో రూప్ జంప్ చేసే సీన్ కూడా సేమ్ టు సేమ్ చిత్రీకరించారు.

కార్ చేజింగ్ సీన్
కార్ చేజింగ్ సీన్ కూడా ఉన్నది ఉన్నట్టుగా చిత్రీకరించారు. హీరో డ్రెస్సు కలర్ కూడా సేమ్ ఉండటం గమనార్హం.

ఐలాండ్ ఎస్కేప్
ఐలాండ్ ఎస్కేప్ సీన్ కూడా ఉన్నది ఉన్నట్లుగా చిత్రీకరించారు.


Click it and Unblock the Notifications











