బ్యాంగ్ బ్యాంగ్: హృతిక్ రోషన్, కత్రినా లుక్ అదిరింది
హైదరాబాద్: హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా బాలీవుడ్లో 'బ్యాంగ్ బ్యాంగ్' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. కత్రినా, హృతిక్ కలిసి నటిస్తున్నారంటేనే సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. ఇపుడు విడుదలైన ఫస్ట్ లుక్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
చివరిసారిగా ఈ ఇద్దరు స్టార్స్ 'జిందగీ న మిలేగి దొబారా' చిత్రంలో కలిసి నటించారు. ఆ చిత్రంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి నటిస్తుండటంపై సర్వతా ఆసక్తి నెలకొంది. యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదో భారీ బడ్జెట్ చిత్రం.

ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ ఫోటోకు సంబంధించిన కాన్పెప్టు కూడా ఆయన క్రియేటివిటీనే అని తెలుస్తోంది. ఇద్దరూ నీళ్లలో ఉండి కనిపిస్తున్న ఈ ఫోటోలో కత్రినా కైఫ్ హాట్ ఎక్స్ ప్రెషన్ ఆకట్టుకుంటోంది. తన ప్రియురాలి కళ్లలోకి చూస్తూ హృతిక్ గన్ పేలుస్తున్నట్లు ఈ ఫోటో డిజైన్ చేసారు. దీంతో పాటు హృతిక్ రోషన్ రగ్గడ్ లుక్‌తో ఉన్న సోలో ఫోటోను కూడా విడుదల చేసారు. ఇందులో హృతిక్ హాలీవుడ్ స్టార్ మాదిరి కనిపిస్తున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సంబంధించిన ఫోటో షూట్ ముంబై సబర్బన్‌లోని ఓ స్విమ్మింగ్ ఫూల్‌లో నిర్వహించారు. ఇందుకోసం ఒక రోజు మొత్తం స్విమ్మింగ్ ఫూల్ బుక్ చేసారు. హాలీవుడ్లో టామ్ క్రూయిజ్, కామెరూన్ డియాజ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'నైట్ అండ్ డే' చిత్రానికి రీమేక్‌గా 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2, 2014న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications











