Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తెలుగు తెరపై కత్తిలాంటి కన్నడ భామలు హవా (ఫోటో పీచర్)
బెంగుళూరు: హీరోయిన్స్ ని ఇంపోర్ట్ చేసుకోవటం సిని పరిశ్రమ ప్రారంభం నుంచి జరుగుతోంది. అక్కడి వాళ్లు ఇక్కడికి ఇక్కడకి వెళ్లటం కొత్తేమీ కాదు. అయితే తెలుగు నుంచి హీరోయిన్స్ బయిటకు వెళ్లటం లేదు కానీ మనకు ముంబై నుంచి బెంగుళూరు నుంచి హీరోయిన్స్ మాత్రం వలస ఓ రేంజిలో ఉంటోంది.
ముఖ్యంగా మన తెలుగులో కన్నడ హీరోయిన్స్ హవా ఓ రేంజిలో నడుస్తోంది. అనుష్క వచ్చి ఇక్కడ స్వీట్ గా సెటిలయ్యి వరస ఆఫర్స్ అందుకుంటూ ముందుకు వెళ్తూంటే అక్కడ మిగతా హీరోయిన్స్ కు కూడా తెలుగులో ఓ లుక్కేయాలనిపించటం సహజం. అందుకు తగినట్లే మన దర్శక,నిర్మాతలు సైతం కన్నడ భామలను బాగానే తమ సినిమాల్లో చోటు కల్పిస్తున్నారు.
ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బెంగుళూరు బ్యూటీలకు తెలుగులో ఓ ప్రత్యేక స్ధానం ఉంది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల దాకా బెంగుళూరు భామలకు ..ముంబై భామల కన్నా ఎక్కువ ప్రయారిటీ ఇస్తూంటారు. దానికి కారణం...వారు మన తెలుగు నేటివిటి లుక్ కలిగి ఉండటమే అని చెప్తూంటారు.
తెలుగులో కి వచ్చిన బెంగుళూరు భామలు స్లైడ్ షో లో...

అనుష్క
నాగార్జున సూపర్ చిత్రంతో పరిచయమైన అనుష్క ఇవాళ తెలుగులో టాప్ స్ధాయిలో ఉంది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడులో నటించిన తర్వాత ఆమెకు గ్లామర్ పరంగా ఓ రేంజి లో మార్కులు పడి ఇక్కడ దాదాపు సెటిలయ్యిపోయింది. తమిళంలోనూ బిజీ అయినా తెలుగులోనూ ఆమె బాహుబలి, రుద్రమదేవి వంటి పాత్రలు చేస్తూ బిజీగా ఉంది.

ప్రణీత
తెలుగులో సిద్దార్ద సరసన బావ చిత్రంతో పరిచయమైన ప్రణీత... తర్వాత ఏమి పిల్లో..ఏమి పిల్లడో అంటూ చేసినా పెద్ద క్రేజ్ రాలేదు. కాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది చిత్రం చేస్తూండటంతో ఆమెను అందరూ పెద్ద హీరోలు కన్సిడర్ చేసే అవకాసం కనపడతోంది. అత్తారింటికి దారేది విడుదల అయ్యాక తెలుగులో సెటిల్ అవ్వచ్చు అంటున్నారు.

షర్మిలా మాండ్రే
అల్లరి నరేష్ సరసన కెవ్వు కేక చిత్రంలో చేసిన షర్మిల కు తెలుగు లో సెటిలవ్వాలనే ఉంది. అయితే ఆమెకు కెవ్వు కేక చిత్రం అనుకున్నంత కిక్ ఇవ్వలేదు. ఆమె నటన పరంగా మంచి మార్కులే సంపాదించినప్పటికీ పెద్ద హీరోల ప్రక్కన ఆఫర్స్ రావటానికి కొంత టైమ్ పట్టచ్చు.

నిధి సుబ్బయ్య
బెంగుళూరు బేబి నిధి సుబ్బయ్య తెలుగు చిత్రం స్వీట్ హార్ట్ తో కెరీర్ ప్రారంభించింది. కానీ ఆ సినిమా క్లిక్ కాకపోవటంతో ఆమెకు ఆపర్స్ రాలేదు. కన్నడంలో,హిందీలో చిత్రాలు చేస్తున్న ఈ ముద్దు గుమ్మ..తెలుగులో దర్శక,నిర్మాతలను కలుస్తూనే ఉంది. త్వరలో మళ్లీ తెలుగు తెరపై కనిపించవచ్చు.

డైసీ బొప్పన
బెంగుళూరు నుంచి మరో భామ డైసీ బొప్పన. ఆమె కూడా తెలుగులో చంటి, రిలాక్స్, స్వీట్ హార్ట్ వంటి చిత్రాలతో తన అదృష్టం పరీక్షించుకుంది. అయితే ఇక్కడ సక్సెస్ రాకపోవటంతో...ఆమెకు కన్నడ ప్రాజెక్టులలో బిజీ అయ్యింది. తెలుగు పరిశ్రమలో మరిన్ని ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటోంది.

సింధు లోకనాథ్
కన్నడ చిత్రం పరిచయతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ...మిస్టర్ లవంగం చిత్రంతో పరిచయం అయ్యింది. తణికెళ్ల భరణి కుమారుడు హీరోగా పరిచయమవుతూ రెడీ అయిన ఈ చిత్రం ఆ సినిమా ఆగిపోవటంతో కెరీర్ ఆగిపోయింది. తదుపరి అవకాసాలు కోసం ఆమె ఆశగా ఎదురుచూస్తోంది.

సనమ్ శెట్టి
తమిళ అంబులి చిత్రంతో పరిచయమైన ఈ కన్నడ మోడల్...ఇప్పుడు ఇంటింట అన్నమయ్య చిత్రంతో తెలుగులో ప్రవేశిస్తోంది. ఈ చిత్రం ప్రొడక్షన్ స్టేజీలో ఉంది. యలమంచిలి సాయి బాబు కుమారుడు హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు డైరక్ట్ చేస్తున్నారు.

సంచిత పదుకోని
కన్నడ చిత్రం రావణ తో ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగులో చమ్మక్ ఛల్లో చిత్రంతో లాంచ్ అయ్యింది. వరుణ్ సందేశ్ సరసన ఆమె నీలకంఠ దర్శకత్వంలో నటించింది. కానీ సినిమా బ్రేక్ ఇవ్వలేకపోయింది. దాంతో ఆమె తదుపరి అవకాసాలు కోసం ఎదురు చూస్తోంది.

సంచిత శెట్టి
రామ్ చరణ్ ఆరెంజ్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఈ కన్నడ ముద్దుగుమ్మ ఆ చిత్రం ఫెయిల్యూర్ కావటంతో ఆఫర్స్ రాక వెనక పడింది. ఆ చిత్రం రన్నింగ్ లో ఉన్నప్పుడు ఆమెకు పెద్ద బ్యానర్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయని టాక్ వినిపించింది.

సుబ్రతా అయ్యప్పా
మోడల్ అయిన సుబ్రత...ఇప్పుడు సాయి ధరమ్ తేజ సరసన రేయ్ చిత్రంలో చేస్తోంది. వైవియస్ చౌదరి దర్శకత్వంలో నటిస్తున్న ఆమె ఇక్కడ మరో ఇలియానాలా వెలిగిపోతాననే ఆశతో ఉంది. ఈ చిత్రం అయ్యేదాకా ఆమె వేరే చిత్రాలు కమిట్ కాదల్చుకోలేదని చెప్తోంది.