విజయ్ దేవరకొండని ఎలా వాడేస్తున్నారో తెలుసా.. అమెజాన్‌కు షాకిచ్చిన కోర్టు!

సంచలన హీరో విజయ్ దేవరకొండ మరోమారు వార్తల్లో నిలిచాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన స్టార్ కాదు. అర్జున్ రెడ్డి చిత్రంతో కర్ణాటక, చెన్నైలో కూడా విజయ్ దేవరకొండకు అభిమానులు ఏర్పడ్డారు. తన విభిన్నమైన యాటిట్యూడ్ తో అభిమానులని ఆకట్టుకోవడం ఎలాగో విజయ్ దేవరకొండకు బాగా తెలుసు. దానికి తోడు విజయ్ నటించిన చిత్రాలు వరుసగా సూపర్ హిట్స్ గా నిలుస్తుండడంతో అతడి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా ఓ కోర్టు పిటిషన్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ వార్తల్లో నిలిచాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ని ముద్దుగా

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ని ముద్దుగా

విజయ్ దేవరకొండ ప్రతి సినిమా వేడుకలో తన అభిమానులని రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ ముద్దుగా పిలుస్తుంటారు. అభిమానులు కూడా రౌడీ విజయ్ దేవరకొండ అని పిలవడం ప్రారంభించారు. అలా రౌడీ అనే పదం విజయ్ దేవరకొండ పుణ్యమా అని ఓ బ్రాండ్ లాగా మారిపోయింది. కొత్తగా, ట్రెండీగా ఏది అనిపించినా దానిని క్యాష్ చేసుకోవడం వ్యాపారస్తులకు అలవాటే. అలా విజయ్ దేవరకొండ క్రేజ్, రౌడీబ్రాండ్ తో బెంగుళూరు వేదికగా వ్యాపారం మొదలైపోయింది.

 రౌడీ వేర్ ప్రయివేట్ లిమిటెడ్

రౌడీ వేర్ ప్రయివేట్ లిమిటెడ్

విజయ్ దేవరకొండ క్రేజ్ ని ఉపయోగించుకుంటూ కొందరు వ్యాపారులు రౌడీ వేర్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో పెద్ద బిజినెస్ ప్రారంభించేశారు. రౌడీ బ్రాండ్ పేరుతో ఆ సంస్థ యువతని ఆకర్షించేలా టీషర్ట్స్, ఇతర వస్త్రాలని తయారు చేస్తోంది. బెంగుళూరులో ఈ వస్త్రాలు బాగా పాపులర్ అయిపోయాయి. అమెజాన్ లో అమ్మకాలు ప్రారంభం కావడంతో రౌడీ బ్రాండ్ తాకిడి తెలుగు రాష్ట్రాలకు కూడా పాకింది. దీని గురించి తెలుసుకున్న విజయ్ దేవరకొండ ఆశ్చర్యపోయాడట.

కోర్టులో పిటిషన్

కోర్టులో పిటిషన్

వెంటనే విజయ్ దేవరకొండ తన లాయర్ సాయంతో బెంగుళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాజాగా కోర్టులో ఈ పిటిషన్ పై విచారణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అమెజాన్ సంస్థకు నోటీసులుజారీ చేస్తూ రౌడీ బ్రాండ్ టీషర్ట్స్ అమ్మకాలు తాత్కాలికంగా నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలో పలు సంస్థలు విజయ్ దేవరకొండకు అండగా నిలిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ క్రేజ్ ని అతడి అనుమతి లేకుండా వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారనే కోణంలో న్యాయవాది వాదనలు వినిపించారు.

డియర్ కామ్రేడ్

డియర్ కామ్రేడ్

న్యాయస్థానం అమెజాన్ సంస్థకు విచారణ పూర్తయ్యాక ఎలాంటి షాక్ ఇస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ దర్శత్వంలో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. మైత్రి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక రెండవసారి హీరోయిన్ గా నటిస్తోంది. కార్మికుల పోరాటాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X