ఫిల్మ్ సిటీ ఓనర్ ఫ్రాడ్- అరెస్టు
బెంగుళూరు ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీ ఓనర్ శరవణ ప్రసాద్, దర్శకుడు శరవణ అచ్యుతానందన్‌లను సిసిబి పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్టు చేశారు. రూ. 2 కోట్ల మోసపూరిత వ్యవహారానికి సంబంధించి చేసిన ఘటనలో పోలీసులలు వీరిని అరెస్టు చేశారు. మైసూర్ రోడ్‌లోని బిదాది ప్రాంతంలో పోలీసులు వీరి అదుపులోకి తీసుకున్నారు. వీరు చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి డబ్బులు సేకరించినట్లు తెలిసింది.
మన రామోజీ ఫిల్మ్ సిటీ మాదిరి ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీ కూడా బాగా ఫేమస్. ఇక్కడ పలు అమ్యూజ్ మెంట్ పార్కులు, ఫిల్మ్ స్టూడియోలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇది ప్రముఖ పర్యాటక స్థలంగా ఉంది.


Click it and Unblock the Notifications











