»   » సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లత మీద ఎఫ్ఐఆర్

సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లత మీద ఎఫ్ఐఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లత మీద బెంగళూరు నగర పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రూపొందించారు. కోర్టులో నకిలి లెటర్ హెడ్ ఇచ్చారని, వంచన చేశారని కేసులు నమోదు చేశామని బెంగళూరు నగర పోలీసు అధికారులు తెలిపారు.

రజనీకాంత్ నటించిన కోచ్చాడియన్ సినిమా విడుదల సందర్బంలో ఈ సినిమా హక్కులను ఇద్దరికి విక్రయించారని (ఒకరికి తెలియకుండా ఒకరికి) మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమన్నాయి. ఆ సందర్బంలో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చెయ్యరాదని, ప్రచురించరాదని లతా కోర్టును ఆశ్రయించారు.

బెంగళూరు లోని కోర్టు ఇలాంటి కథనాలు ప్రచురించరాదని, ప్రసారం చెయ్యరాదని స్టే ఆర్డర్ (gag order) ఇచ్చింది. చెన్నయ్ కోర్టులోనూ లతా స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. తరువాత వార్తలు బయటకు రాలేదు. అయితే తమిళనాడులో వార్తలు ప్రసారం కావడంతో కర్ణాటకలోనే మళ్లి మొదలైనాయి.

Bangalore police registering an FIR against super star Rajinikanth's wife

అయితే 2014 నవంబర్ నెలలో లతా రజనీకాంత్ ఆడ్ బ్యూరో పేరుతో కోర్టుకు సమర్పించిన లెటర్ హెడ్ నకిలీదని వెలుగు చూసింది. బెంగళూరు మెట్రో పాలిటిన్ మేజిస్ట్రేట్ న్యాయాలయం ఈనెల 9వ తేదిన లతా రజనీకాంత్ మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది.

న్యాయస్థానంలో ఆడ్ బ్యూరో కంపెనీ పేరుతో నకిలి లెటర్ హెడ్ ఇచ్చారని వెలుగు చూసింది. కోచ్చాడియన్ సినిమాను మీడియా ఒన్ ఎంటర్ టైన్మెంట్ లిమిటెడ్ పేరుతో నిర్మించారు. ఈ సినిమాకు రజనీకాంత్ కుటుంబ సభ్యులు భాగస్వాములు.

సినిమా గ్రాఫిక్ వర్క్, పోస్ట్ ప్రోడెక్షన్ పనులు పూర్తి చేసి ఇవ్వాలని ఆడ్ బ్యూరో కంపెనీ అభీర్ చంద్ నహర్ అనే వ్యక్తికి అప్పగించారు. అందుకు రూ. 10 కోట్లు చెల్లిస్తామని ఆడ్ బ్యూరో కంపెనీ ఒప్పందం కుదుర్చుకునింది. అయితే అభీర్ చంద్ నహర్ కు రూ. 6.84 కోట్లు బాకీపడ్డాడు.

రూ. 10 కోట్లు నగదు చెల్లిస్తామని ఇచ్చిన అగ్రీమెంట్ లో తాను నగదు చెల్లించడానికి పూర్తిగా పూచీ ఉంటానని లతా రజనీకాంత్ సంతకం చేశారని అభీర్ చంద్ నహర్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు నకిలి లెటర్ హెడ్ ఇచ్చారని, నగదు ఇవ్వకుండ మోసం చేశారని లతా రజనీకాంత్ మీద కేసులు నమోదు అయ్యాయి.

English summary
Bangalore police registering an FIR against super star Rajinikanth's wife Latha for allegedly producing fake documents in a court in Bangalore to get a gag order on the media.
Please Wait while comments are loading...