పవన్ బంగారం చెన్నైలో ఉండదు
పవన్ కళ్యాణ్ బంగారం సినిమా చెన్నైలో, తమిళనాడులోని తెలుగు ప్రాంతాల్లో విడుదల కావడం లేదు. ఇది తమిళనాడులోని పవన్ అభిమానులకు తీవ్ర ఆసంతృప్తికి గురిచేసింది. బంగారం రేపు 265 ప్రింట్లతో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. బంగారం తమిళ రీమేక్ హక్కులను నిర్మాత ఎఎం రత్నం స్వర్గచిత్ర అప్పాచన్‌కు భారీ మొత్తానికి విక్రయించారు. తమిళ వెర్షన్‌లో విజయ్ నటిస్తున్నారు. చెన్నైలోని సత్యం థియేటర్ నుంచి బంగారంకోసం తీసుకున్న భారీ మొత్తాన్ని ఎఎం రత్నం తిరిగి చెల్లించేశారు. ఈ విషయాలు ముందుగా తెలియని చెన్నైలోని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఖర్చు పెట్టి కటౌట్లు అమర్చారు. తీరా ఈ సినిమా చెన్నైలో విడుదల కాదని తెలుసుకున్న వారు ఆగ్రహంతో ఊగిపోయారు. తిరుపతి, చిత్తూరులలో ఈ సినిమా చూడడానికి వారు ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకున్నారు.


Click it and Unblock the Notifications