బంగారం టికెట్ల ధరలు పెంపు
పవన్ కళ్యాణ్- ఎఎం రత్నంల బంగారం సినిమా టికెట్ ధరలను మొదటి రెండు వారాలు పెంచుతారు. ఈ సినిమా మే 3న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరలను మొదటి రెండు వారాల పాటు పెంచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పెద్ద సినిమాల నిర్మాతలు కూడా టికెట్ల ధరలను పెంచడానికి సాహసించడం లేదు. కానీ ఎఎం రత్నం మాత్రం బంగారం టికెట్ల ధరలను పెంచడాన్ని సమర్ధించుకున్నారు. భారీ వ్యయంతో తీసిన భారతీయుడు సినిమా టికెట్లను హోంశాఖ ప్రత్యేక అనుమతితో ఆ రోజుల్లోనే పెంచానని రత్నం చెప్పారు. మీరా చోప్రా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ధరణి దర్శకత్వం వహించారు. 265 ప్రింట్లతో ఈ సినిమా విడుదల కానుంది. భారీ వ్యయంతో ఈ సినిమాను తీసినప్పటికీ బిజినెస్ సంతృప్తికరంగా జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications