twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరువు హత్యలకు చక్కని ముగింపునిచ్చేలా ‘బంగారి బాలరాజు’

    |

    నంది క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు కేఎండీ రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి సారథ్యంలో కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "బంగారి బాలరాజు". ఈ చిత్రంలో రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఈ సందర్భంగా చిత్ర హీరో రాఘవ్ మీడికు సినిమా గురించి వివరాలు వెల్లడించారు. రాయలసీమలో జరిగిన ఒక యథార్థ పరువు హత్య నేపథ్యంలో 'బంగారి బాలరాజు' సినిమా తెరకెక్కుతోందని, పరువు కోసం తల్లిదండ్రులు ఎంతటి దారుణానికైనా వెనకాడట్లేదని, రాయలసీమలో నిజంగా జరిగిన అలాంటి పరువు హత్య నేపథ్యంలో ఈ కథ ఉంటుందని రాఘవ్ వెల్లడించాడు.

    Bangari Balaraju movie based on a true incident

    ప్రేమ, పరువు హత్యలతో పాటు తల్లీకొడుకుల సెంటిమెంట్, ఎమోషన్ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపాడు. తాజాగా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య అనేక చర్చలకు దారితీసిందని.. ఇలాంటి ఘటనలకు తమ సినిమా ద్వారా చక్కని ముగింపునిచ్చే ప్రయత్నం చేశామని తెలిపారు.

    ఇప్పటికే చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు సంగీతం అందించిన ఆరు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను మా నిర్మాతలు ఇచ్చిన సహకారం మరవలేనిది. హీరోయిన్ గా పరిచయమైన కరోణ్య రాములమ్మ డైలీ సీరియల్ తో పాటు ఆట6 విన్నర్ గా పెరు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో అద్భుతంగా నటించిందని తెలిపారు.

    నిర్మాతల్లో ఒకరైన రెడ్డం రాఘవేంద్ర రెడ్డి మా నాన్న. నిర్మాత కొడుకుగా కాకుండా నటుడిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. దర్శకుడు కోటేంద్ర బాగా సపోర్ట్ చేశారు. గ్రేట్ పర్సన్. షూటింగ్ సమయంలో సీన్ టూ సీన్ వివరించేవారు. తాను అనిత ఓ అనిత లాంటి సూపర్ హిట్ సాంగ్ లో నటించారు. అలాగే టెలి ఫిలిం రైల్వే ట్రాక్ తో నంది అవార్డు అందుకున్నారు. ఈనెల 25న విడుదల కాబోతున్న మా సినిమా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

    English summary
    Bangari Balaraju movie features Raghav, Karonya Katrin. The film script based on a true incident that occurred in Kurnool, Andhra Pradesh is written and directed by Kotendra Dudyala and produced by K Md Rafi and Reddam Raghavendra Reddy under Nandini Creations Banner. Cinematography has been handled by GL Babu and the music has been composed by Chinni Krishna. The film is releasing on October 25th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X