Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బంగారి బాలరాజు పాటలను ఆవిష్కరించిన దిల్ రాజు, మంత్రి అఖిలప్రియ
బంగారి బాలరాజు చిత్రం ఆడియోలోని మొదటి మూడు పాటలను నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాతలు అశ్వనీదత్, అనిల్ సుంకర విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం లోని మరోపాట 'నా కొంగులో నా గుండెలో....' అంటూ సాగే సాంగ్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా దిల్ రాజు గారు మాట్లాడుతూ... కొత్తవారితో తెరకెక్కిన బంగారి బాలరాజు సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచిపేరు తీసుకురావాలని మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
టిడిపి నాయకులు బిజ్జం పార్ధసారధి రెడ్డి గారు మాట్లాడుతూ... బంగారి బాలరాజు సినిమా మంచి విజయం సాధించాలని హీరో, దర్శక నిర్మాతలకు విషెస్ అందించారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖా మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ... అంతా కొత్తవారితో చక్కని ప్రేమకధా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ప్రజలందరికి బాగా నచ్చుతుందని, దర్శకనిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ చిత్రంలోని ఈ చక్కటి పాటను నా చేతుల మీదుగా రిలీజ్ కావడం అనందంగా ఉందని తెలిపారు.
హీరో రాఘవ్ మాట్లాడుతూ.. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మా చిన్నసినిమాకి పెద్దమనసు తో బంగారి బాలరాజు సినిమాలోని నా కొంగులో నా గుండెలో అనే పాటను విడుదల చేసి మా టీం కు బ్లెస్సింగ్స్ అందించండం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్బంగా దిల్ రాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత కె.యమ్ డి. రఫి మాట్లాడుతూ... "బంగారి బాలరాజు సినిమా లోని మంచి ఫీల్ తో సాగే ఈ పాటను దిల్ రాజు గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. 'అలాగే ఈ చిత్రంలోని 'ఏమి కళ్లురో మామ'... అనే పాటను మా వెల్ విషర్, టిడిపి నాయకులు బిజ్జం పార్ధసారధి రెడ్డి అన్నగారు, మరియు 'చెలియా నీ కోసం'.... అంటూ సాగే పాటను ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖా మంత్రి భూమా అఖిలప్రియ చేతుల మీదుగా విడుదల కావడం జరిగింది. అతిరధమహారధులు మా చిత్రంలోని పాటలను విడుదల చేసి వారి ఆశీస్సులను అందించడం మా చిత్ర యూనిట్ కు మరెంతో ఉత్సాహాన్ని కలిగించింది. మా తరుపున, మా యూనిట్ తరుపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ... దిల్ రాజుగారు, బిజ్జం పార్దసారధి రెడ్డి గారు, భూమా అఖిలప్రియ గారు మా బంగారి బాలరాజు చిత్రంలోని పాటలను విడుదల చేయడం ఆనందంగా ఉందంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు.