ప్రేమిస్తే చంపేస్తాం, చచ్చిపోతాం.. ప్రణయ్ హత్య జరిగి ఉండేది కాదు.. బంగారి బాలరాజు చిత్రంలో!
Recommended Video

మంచి కంటెంట్ తో సినిమా రావాలే కానీ చిన్న చిత్రాలు కూడా ఘనవిజయం సాధిస్తుంటాయి. చిన్న చిత్రాలు విజయం సాధిస్తే ఆ నిర్మాతకు లాభాల పంట పడుతుంది. చిన్న చిత్రాల కోవలోకి చెందిన బంగారి బాలరాజు చిత్రం అక్టోబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలు తెలియజేసారు. రొమాంటిక్ ప్రేమ కథాచిత్రంగా బంగారి బాలరాజు చిత్రం రూపొందుతుండడం విశేషం. ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తించేలా బంగారి బాలరాజు చిత్ర ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ప్రేమ చావుని కోరుకుంటుందా
నిజమైన ప్రేమ చావుని కోరుకుంటుందా అనే కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. ఈ మధ్యన ప్రేమ పేరుతో జరుగుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ప్రేమిస్తే చంపేస్తాం, ప్రేమని ఒప్పుకోకుంటే చచ్చిపోతాం అనే వార్తలు చూస్తూనే ఉన్నాం. అలాంటి అంశాల ఆధారంగా నిజమైన ప్రేమ చావుని కోరుకుంటుందా అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఆరు పాటలు అద్భుతంగా
ఈ చిత్రం ఆరు పాటలు ఉన్నాయని దర్శకుడు కోటేంద్ర దుద్యాల తెలిపారు. ఆరు పాటలు అద్భుతంగా వచ్చాయి. అక్టోబర్ 25న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని దర్శకుడు తెలిపాడు. అందరూ ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదించాలని కోరారు.

బంగారంలాంటి సినిమా
ఈ చిత్రంలో హీరోగా బాలరాజు పాత్రలో నటించిన రాఘవ్ మాట్లాడుతూ.. బంగారి బాలరాజు చిత్రం బంగారం లాంటి సినిమా అని తెలిపాడు. బంగారి బాలరాజు చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. కామెడీ, యాక్షన్ అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని రాఘవ్ తెలిపాడు.

పరిష్కారం చూపించాం
సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న నేరాలకు ఈ చిత్రంలో పరిష్కారం చూపించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. బంగారి బాలరాజు చిత్రం కాస్త ముందుగా విడుదలై ఉంటే మిర్యాలగూడ ఘటన ప్రణయ్ హత్య జరిగి ఉండేది కాదని చిత్ర యూనిట్ అభిప్రాయ పడింది. రఫి, గడ్డం రాఘవేంద్ర రెడ్డి ఈ చిత్రానికినిర్మాతలు . రాఘవ్, కారుణ్య హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











