కలర్స్ స్వాతి 'బంగారు కోడి పెట్ట' రిలీజ్ డేట్

మూడు కథలతో రాజ్ పిప్పళ్ల దర్శకత్వంలో గురు ఫిలింస్ పతాకంపై తొలి ప్రయత్నంగా సునీత తాటి నిర్మిస్తున్న చిత్రం 'బంగారు కోడిపెట్ట'.భయమంటే ఏమిటో తెలియని కుర్రాడు వంశీ. ఏ పనైనా సొంతంగానే చేయాలనుకొంటాడు. ఎవరికీ ఏ విషయంలోనూ దొరకడు. అచ్చం అలాంటి అబ్బాయి కోసమే ఎదురు చూసింది భానుమతి. తను ఎదగాలంటే అలాంటి ఓ టక్కరి కుర్రాడు అవసరమనేది భాను ఆలోచన. అందుకే గురి చూసి ఓ వాలు చూపు విసిరింది. దెబ్బకి పడిపోయాడు. మరి ఆ తర్వాత వీరి ప్రయాణం ఏ రీతిన సాగిందో తెరపైనే చూడాలంటున్నారు రాజ్ పిప్పళ్ల. ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం కథ నేరేషన్ ఎలా నడుస్తుందంటే... ''భాను అనే ఓ మధ్య తరగతి అమ్మాయి తన కాళ్ల మీద నిలబడే ప్రయత్నంలో టక్కరివాడైన వంశీని ఎంచుకోవడం మొదటి కథ. పిజ్జా డెలివరీ బోయ్‌గా పని చేస్తూ, తెలుగు సినిమా హీరో అవ్వాలని ఓ కుర్రాడు చేసే ప్రయత్నమే రెండో కథ. కవలల నేపథ్యంలో మూడో కథ సాగుతుంది. ఈ మూడు కథలు ఒకచోట కలవడంతో సినిమా ప్రారంభమవుతుంది. సంక్రాంతి నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. వినోదాత్మకంగా సాగే రొమాంటిక్ క్రైమ్ కథాచిత్రమిది. మూడు విభిన్న కథలతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి కథలో వంశీగా నవదీప్, భానూగా స్వాతి నటించారు.
దర్శకుడు రాజ్ పిప్పళ్ల మాట్లాడుతూ...అందరికీ ఓ బంగారు కోడిపెట్ట ఉంటుంది. దానితో ఆనందం,మనశ్సాంతి దొరుకుతుంది. దాని కోసం తట్ట, బుట్ట క్రింద వెతుకుతాం. ఈ సినిమాలో రియలైజ్ అయ్యేదేమిటంటే...బంగారు కోడిపెట్ట మన మనస్సులోనే ఉంది . సంక్రాంతి నేపథ్యంలో సాగే చిత్రమిది. మనిషి తన జీవితంలో రకరకాల అడ్డదారులను వెదుకుతుంటాడు. జీవితం మాత్రం తనదైన దారినే చూపెడుతుందన్న అంశాన్ని ఇందులో ఆసక్తికరంగా చెప్పాం. దొంగతనం, పేకాట, కోడి పుంజు అపహరణ, సినిమా ఆడిషన్స్ తదితర అంశాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతాయి''అన్నారు.
హీరోయిన్ కలర్స్ స్వాతి మాట్లాడుతూ... సునీత, రాజ్ లతో పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. రియల్ జర్నీలా ఉంది. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా. సునీ ఎనర్జీ నైస్ అన్నారు. నవదీప్ మాట్లాడుతూ... ఈ సినిమాకు అందరూ తలో కాస్త ఇన్ పుట్స్ ఇచ్చి ఈ సినిమాను చేసాం. బెటర్ మెంట్ చేసాం. న్యూ జనరేషన్ మూవీ వచ్చింది అని అందరూ అంటారు అన్నాడు.


Click it and Unblock the Notifications











