బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్ కథతో నాగచైతన్య
నాగచైతన్య నాలుగవ చిత్రం అజయ్ భుయాన్ దర్శకత్వంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందనుంది. జూన్ ఇరవై ఒకటవ తేది నుంచి ఈ చిత్రం షూటింగ్ బ్యాంకాక్ లో జరగనుంది. కాజల్ హీరోయిన్ గా చేసే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారని సమాచారం. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి కెమెరాని జ్ఞాన శేఖర్(వేదం ఫేమ్) అందించనున్నారు. బొమ్మరిల్లు చిత్రానికి చక్కని మాటలు రాసిన అబ్బూరి రవి ఈ చిత్రానికి సైతం డైలాగులు అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం కథ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని, ఊహించని ట్విస్ట్ లు, గోవాలో కేసినోలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ అంటున్నారు. ఇక అజయ్ భుయాన్ రూపొందించిన హౌస్ ఫుల్ చిత్రం ఎవరూ కొనక ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. అలాగే ఈ చిత్రాన్ని శివప్రసాద్ రెడ్డి తమ కామాక్షి మూవీస్ ఎంటర్టైనర్ పతాకంపై రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











