»   » లవర్ బాయ్ పాత్రలో బ్రహ్మానందం (ఫోటోలు)

లవర్ బాయ్ పాత్రలో బ్రహ్మానందం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం...అంటే పరిశ్రమలో ఎంత డిమాండ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన లేకుండా ఏ స్టార్ హీరో సినిమా ఉండదంటే అతిశయోక్తి కాదేమో. మరి అలాంటి బ్రహ్మానందమే హీరోగా సినిమా తెరకెక్కిస్తే ప్రేక్షకులు కడుపు చెక్కలయ్యేలా నవ్వవడం ఖాయం. ఇదే ఆలోచనతో ఓ సినిమా తెరకెక్కుతోంది.

ఎస్.బి.ఆర్ ఫిలిం వర్క్స్ పతాకంపై బ్రహ్మానందం హీరోగా అందాల రాముడు చిత్ర దర్శకుడు పి. లక్ష్మీనారాయణ రూపొందిస్తున్న ఫుల్లీలోడెడ్ కామెడీ మూడీ 'బ్యాంకాక్ బ్రహ్మానందం'. రాజా కృష్ణ భగవాన్, ముత్యాల రమేష్ నిర్మాతలు. స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వాతిముత్యం లాంటి చిత్రాలకు మాటలు రాసిన సాయినాథ్ ఈ చిత్రానికి డైలాగులు రాస్తున్నారు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం లవర్ బాయ్‌గా, సన్నాయి వాయిద్య కారుడిగా, సంగీతం మాస్టారుగా మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

రొమాంటిక్ కామెడీ..

రొమాంటిక్ కామెడీ..

రొమాన్స్ తో కూడిన వినోదాత్మక చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ఈ చిత్రంలో బ్రహ్మానందం మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని దర్శకుడు పి.లక్ష్మీ నారాయణ తెలిపారు.

బహ్మానందం

బహ్మానందం

బ్రహ్మానందం సకల కళా వల్లభుడభుడని, ఎటువంటి పాత్రకైనా న్యాయం చేయగలడని, ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తాడని, ఈచిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు తెలిపాడు.

షూటింగ్

షూటింగ్

ఇప్పటి వరకు ఈ చిత్రం 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించే చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు.

నటీనటులు

నటీనటులు

బ్రహ్మానందం, సత్యకృష్ణ, జె.పి, ఎమ్మెస్ నారాయణ, గౌతం రాజు, రాఘవ, పృథ్వీ, గుండు హనుమంతరావు, భావన, అమ్మరాజశేఖర్ తదితరులు నటిస్తున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి కథ: రాజా కృష్ణ భగవాన్, రచన-స్క్రీన్ ప్లే: గోపీ వెంకట్, గంగోత్రి విశ్వనాథ్, కెమెరా: జవహర్ రెడ్డి, సంగీతం: వందేమాతరం శ్రీనివాసరావు, ఎడిటర్: నందమూరి హరి

English summary
Tollywood top comedian Brahmanandam has done few films as a hero and after a long gap he is getting ready to do it again. Director P Lakshmi Narayana, is going to do this.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu