ఆ సినిమాలకు బ్యాంకాక్ సెంటిమెంట్!!
వైజయంతి మూవీస్ సంస్థ అధినేత అశ్వినీదత్ కు బ్యాంకాక్ సెంటిమెంటున్నట్టుంది. చిరుత సినిమాలో చాలా భాగాన్ని ఆయన బ్యాంకాక్ లో చిత్రీకరించారు. ఇపుడు ఆయన కంత్రీ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా బ్యాంకాక్ లో చేయడానికి షెడ్యూల్ సిద్ధమయింది. అంటే రామ్ చరణ్ తరువాత బ్యాంకాక్ కు జూనియర్ ఎన్టీఆర్ వెళుతున్నారన్నమాట. ఇంకో విశేషం ఏమంటే చిరుత సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా కంత్రీ సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూరి జగన్నాథ్ కు నచ్చిన విదేశీ స్పాట్ బ్యాంకాక్ అని స్వయంగా ఆయనే చెప్పాడు. మరి మెహర్ రమేష్ కు కూడా అదే స్పాట్ నచ్చిందా లేక గురువు బాటలో శిష్యుడు వెళుతున్నాడా అన్నది ఆయనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











