రామ్ చరణ్ కి సైతం బ్యాంకాక్ సెంటిమెంట్
మనకు తెలుగులో పూరీ జగన్నాధ్ చిత్రాల్లో రెగ్యులర్ గా బ్యాంకాక్ టూర్ ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు. రామ్ చరణ్,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో చరణ్ తొలి చిత్రంగా వచ్చిన చిరుత షూటింగ్ బ్యాంకాక్ లో జరిగింది. ఇప్పుడు తన హిందీ ఎంట్రీ ఫిలిం జంజీర్ కు కూడా బ్యాంకాక్ లో షూటింగ్ పెట్టుుకన్నాడు. ఈ మేరకు ఓ షెడ్యూల్ బ్యాంకాక్ లో పూర్తి చేసుకుని వచ్చారు.
జంజీర్ చిత్రంలో రామ్ చరణ్ ..ఎసిపి విజయ్ కన్నాగా కనిపించి అలరించునున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రం మ్యూజికల్ గానూ సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై జంజీర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది.
1973లో అమితాబ్ బచ్చన్ నటించిన 'జంజీర్'కి ఈ చిత్రం రీమేక్. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్ మెహ్రా నిర్మాత. నాటి చిత్రంలో జయ బాధురి పోషించిన పాత్రకు ప్రియాంక చోప్రాను ఎంపిక చేసుకొన్నట్లు హిందీ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే దర్శకుడు ప్రియాంకతో చర్చించారు. ఆమె అంగీకారం తెలిపారు. అయితే అందుకు ఆమెకు ఆరు కోట్లు వరకూ రెమ్యునేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమ సినిమాలో ఉంటే ఓపినింగ్స్ కు లోటు ఉండవని భావించి ఆమెను ఓకే చేసారు. రామ్ చరణ్ అక్కడ కొత్త వాడు కావటంతో అన్ని రకాలుగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అలాగే ఆ చిత్రంతో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. ఈ రీమేక్‌లో అమితాబ్ అతిథి పాత్రలో కనపడటానికి అమితాబ్ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్ సమాచారం. ఈ విషయమై దర్శకుడు అపూర్వ లఖియా ని మీడియా సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ ''అమితాబ్ మా సినిమాలో నటిస్తున్నారని ఇంకా అధికారికంగా చెప్పలేను. ఆయన్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే. బిగ్ బి ఆశీస్సులు లేకుండా ఈ సినిమాను తీయలేం'' అన్నారు.
రామ్ చరణ్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..నేను చాలా స్క్రిప్టులు బాలీవుడ్ ఎంట్రీ కోసం విన్నాను. వాటిలో ఏదీ నన్ను ఎక్సైట్ చేయలేకపోయింది. నేను లవర్ బోయ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ అవ్వదలుచుకోలేదు. జంజీర్ చిత్రం నాలో ఉన్న ట్యాలెంట్ ని వెలికి తీస్తుందనిపిస్తోంది. నన్ను కొత్తగా ప్రెజెంట్ చేస్తుందని నమ్మకం ఉంది అని అన్నారు. హీరోయిన్ గా చేస్తున్న ప్రియాంక చోప్రా సైతం ఈ సినిమాపై మంచి అంచనాలే పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











