నీవు ముఖేష్ అంబానీ అయితేంటి? ఐ డోంట్ కేర్.. అనంత్ పెళ్లి కోసం 100 కోట్ల ఆఫర్.. రిజెక్ట్ చేసిన సింగర్
దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ కల్యాణ వేడుకకు బాలీవుడ్ సూపర్ స్టార్స్, సినీ, రాజకీయ అధినేతలు, ప్రపంచవ్యాప్తంగా పేరున్న బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్ లాంటి వాళ్లు ఈ పెళ్లికి హాజరైన విషయం తెలిసిందే.
అయితే ఈ వివాహ వేడుక కోసం బంగ్లాదేశ్‌కు చెందిన బోల్డ్ యాక్టర్, సింగర్ జాయేద్ ఖాన్‌ను ముఖేష్ అంబానీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించగా ఆయన ఆఫర్‌ను ఎలాంటి కనికరం లేకుండా రిజెక్ట్ చేశారు. ప్రస్తుతం వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ ఇద్దరి మధ్య సంభాషణ జరిగిన తీరు ఎలా ఉందంటే?

హలో జాయేద్ ఖాన్.. ముఖేష్ మాట్లాడుతున్నాను అని అంటే.. ఎవరు? అని జాయెద్ ప్రశ్నించాడు. దాంతో నేను ముఖేష్ అంబానీ మాట్లాడుతున్నాను. నా కొడుకు వివాహం జరుగుతున్నది. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వస్తున్నారు. మీరంటే వారికి ఇష్టం మీరు కూడా రావాలి. నేను అందరికి దావత్ ఇస్తున్నాను అని ముఖేష్ అంబానీ ఆహ్వానించారు.
ముఖేష్ అంబానీ మీరు నాకు బాగా తెలుసు. మీరు ఫోన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముగ్గురు ఖాన్స్ అలా అన్నారా? అంటూ జాయెద్ ఖాన్ ఆశ్చర్యపోయాడు. దాంతో నీవు రావాలి. నీవు అంటే నా కొడుకు అనంత్ అంబానీకి కూడా చాలా ఇష్టం. నీవు రాకపోతే నా కొడుకు పెళ్లి కూడా చేసుకోనంటున్నాడు. కాబట్టి ఎలాగైనా నీవు రావాలి అని ముఖేష్ అంబానీ రిక్వెస్ట్ చేశాడు. దాంతో నేను చాలా బిజీగా ఉంటాను అని జాయేద్ అంటే.. సాధారణంగా నా పీఏ ఫోన్ చేస్తాడు. కానీ నీవు కాబట్టి నేను స్వయంగా ఫోన్ చేశాను. నీవు రిజెక్ట్ చేయవని అనుకొంటున్నాను అని అంబానీ సమాధానం ఇచ్చాడు.

ముఖేష్ అంబానీ రిక్వెస్ట్ తర్వాత.. జాయేద్ సమాధానం ఇస్తూ.. పెళ్లి ఎప్పుడు? అని అడిగాడు. దాంతో రెండు, మూడు రోజుల తర్వాత అని ముఖేష్ సమాధానం ఇచ్చాడు. దాంతో నా షెడ్యూల్ జామ్ ప్యాక్‌గా ఉంది. ముస్లీంల వేడుకల్లో నేను బిజిగా ఉన్నాను. కాబట్టి రాలేను అని జాయెద్ సమాధానం ఇచ్చాడు. దాంతో నా ఇంట్లో జరిగే పెళ్లికి కాకుండా ముస్లింల వేడుకలో పాల్గొంటావా? అని ముఖేష్ ప్రశ్నించాడు. నేను కమిట్ అయితే మాట తప్పను. కాబట్టి నేను రాలేను అంటూ అవతలి నుంచి సమాధానం వచ్చింది.
దాంతో నీకు ఫోన్ చేసింది ముఖేష్ అంబానీ అనే విషయం గుర్తుంచుకో అంటే.. నీవు ముఖేష్ అంబానీ వైనా నాకు లెక్కలేదు. నేను పెట్టించుకోను. నేను జాయేద్ ఖాన్. షారుక్, సల్మాన్ ఖాన్ లాంటి వారే నా ఫ్యాన్స్ అంటే ఘాటుగా సమాధానం ఇచ్చాడు. దాంతో నా కొడుకు పెళ్లికి రాకుండా చిన్న ఫంక్షన్ వెళ్తావా? నీకు అక్కడ ఎంత వస్తుంది అని ముఖేష్ అడిగితే.. 30 వేలు వస్తుంది జాయెద్ సమాధానం ఇచ్చాడు.
అయితే 30 వేల రూపాయల కోసం నీవు నా రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేస్తున్నావా? నేను బిచ్చగాళ్లకు 30 వేల రూపాయలు బహుమతి ఇస్తాను. నేను నీకు 30 లక్షలు ఇస్తాను. నా ఇంట్లో పెళ్లికి రా.. అని అంటే.. నీవు 30 కోట్ల రూపాయలు ఇచ్చినా నేను రాలేను. నేను కమిట్‌మెంట్ ఇస్తే ఎవరు అడిగినా, ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా నేను నా మాట తప్పను. నా మాట నేనే వినను అని జాయెద్ ఖాన్ ముక్కుసూటిగా చెప్పేశాడు.

ఓ దశలో ముఖేష్, జాయెద్ మధ్య మాట మాట పెరిగింది. నీవు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటూ ఇద్దరు సవాళ్లు వేసుకొన్నారు. నీవు ఎవరైనా కానీ మాట తప్పి డబ్బు కోసం నీ ఆఫర్ స్వీకరించను అని జాయేద్ అంటే.. నేను ఎవరో తెలుసా? చిటికెలో నీ కెరీర్ నాశనం చేస్తా అని అంటే.. మీరు హద్దు మీరి మాట్లాడుతున్నారు అంటూ జాయెద్ ఖాన్ వార్నింగ్ ఇచ్చినంత పనిచేశాడు. అయితే ముఖేష్ అంబానీ కొంచెం తగ్గి.. శాంతంగా ఆలోచించు అంటూ రిక్వెస్ట్ చేశాడు.
అనంత్ అంబానీ పెళ్లికి రాలేను అని చివరకు జాయేద్ ఖాన్ అని తేల్చేశాడు. అయితే మీ అబ్బాయికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ విషయం నాకు దుబాయ్‌లో తెలిసింది అంటే.. అవునా.. అయితే అనంత్‌ను బంగ్లాదేశ్ పంపిస్తాను. నీవు అక్కడే ట్రైనింగ్ ఇవ్వు. నీకు 100 కోట్లు ఇస్తాను. మూడు రోజుల తర్వాత పంపిస్తా అంటే.. లేదు.. మూడు రోజులు కాదు. నెల తర్వాత పంపించు.. అప్పుడు నేను ఫ్రీగా ఉంటాను అని జాయెద్ ఖాన్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ వీడియో నిజమా? ఫేకా? అనే విషయంపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











