Riya Barde: శిల్పాశెట్టి భర్త సినిమాల్లో అడల్డ్ హీరోయిన్ అరెస్ట్.. పోలీసులు ఎందుకు పట్టుకొన్నారంటే?

Riya Barde: బాలీవుడ్ హాట్ బ్యూటీ, బంగ్లాదేశ్‌కు చెందిన అడల్డ్ హీరోయిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్రాలతో భారత్​లో అక్రమంగా ఉంటున్నందుకు బంగ్లాదేశ్​ పోర్న్​ స్టార్​ ముంబాయి పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? ఆమెను పోలీసులు ఎందుకు పట్టుకున్నారు? మీరు ఓ లూక్కేయండి.

భారత్‌లో ఉండేందుకు నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించిన బంగ్లాదేశ్‌కు చెందిన పోర్న్ స్టార్‌ రియా అరవింద బార్డే ని అరెస్టు చేశారు. ముంబైకి 50 కి.మీ దూరంలోని ఉల్హాస్‌నగర్‌లో నటిరియా బర్డేను హిల్‌లైన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ కుటుంబం నెవాలీలోని అంబర్‌నాథ్‌లో నకిలీ పత్రాలతో నివసిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బంగ్లాదేశ్​ పోర్న్​ స్టార్​ రియా బర్డేని మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్ నగర్​లో గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

Bangladeshi adult heroine Rhea Aravinda Barde has been arrested by the Mumbai police

విచారణలో ఆమె కుటుంబ సభ్యులు చేసిన మోసాలు వెలుగుచూశాయి. బంగ్లాదేశ్ కు చెందిన రియా బార్డే, ఆమె ముగ్గురుతో కలిసి ఇండియాలో ఉండటానికి వీలుగా నకిలీ పత్రాలను రూపొందించినట్లు వెల్లడైంది. హిల్‌లైన్ పోలీసులు రియాతో పాటు మరో నలుగురిపై ఫారినర్స్ యాక్ట్, 1946 సెక్షన్ 14(A)తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రమేయమున్న మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. నిందితురాలి తల్లిదండ్రులు ప్రస్తుతం ఖతార్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి రియా బర్డే గుర్తింపుపై ఏడాది క్రితం దర్యాప్తు ప్రారంభమైంది. ఆమె బర్త్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్, పాస్ పోర్టులో పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాలు, హుగ్లీ, మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని అచల్పూర్ అనే మూడు వేర్వేరు జన్మ స్థలాలు ఉన్నాయని తేలింది. అలాగే.. రియా బర్డే తన ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేయడమే కాకుండా.. తన సహచరుల్లో ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, పాస్ పోర్టు పొందడానికి కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. అదుపులోకి తీసుకున్న ముంబాయి పోలీసులు రియాను కోర్టులో హాజరుపర్చారు. ఏడుగురు న్యాయవాదుల బెంచ్ ఈ కేసును విచారించింది. రియా బంగ్లాదేశీ అని ఏ ప్రాతిపదికన రుజువు చేస్తారని న్యాయవాదులు కోర్టులో ప్రశ్నించారు. రియా అరెస్ట్ వ్యవహారంపై సుమారు గంటన్నరపాటు చర్చ జరిగినట్లు సమాచారం. కోర్టు రియాను అక్టోబర్ 1 వరకు థానే పోలీసుల కస్టడీకి పంపింది.

Bangladeshi adult heroine Rhea Aravinda Barde has been arrested by the Mumbai police

ఇంతకీ రియా బార్డే ఎవరు?

రియా అరవింద్ బార్డే ఎవరంటే బంగ్లాదేశ్ పోర్న్ స్టార్. ఆమెకే ఆరోహి బార్డే, బన్నా షేక్ అనే మార్లు పేర్లు ఉనాయి. ఆమె పేరు అంజలి బార్డే అలియాస్​ రూబీషేక్, రియా బార్డే కు సోదరుడు రవీంద్ర అలియాస్​ రియాజ్ షేక్, ఆమె సోదరి రీతు అలియాస్​ మోనీ షేక్ తో కలిసి భారతదేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారు. రియా బార్డే తల్లి రూబీ షేక్ వాస్తవానికి బంగ్లాదేశీ వాసీ, ఆమె మహారాష్ట్రలోని అమరావతికి చెందిన అరవింద్ బర్డేను వివాహం చేసుకుందని సమాచారం. ప్రస్తుతం రియా తండ్రి, తల్లి ఖతార్​లో నివసిస్తున్నారు.

ఈ హాట్ బ్యూటీ రియా బార్డే ఎక్కువగా అడల్ట్ ఫిల్మ్ లో నటించింది. ఆమె రాజ్ కుంద్రా ప్రొడక్షన్స్​లోని పలు ప్రాజెక్టుల్లో పనిచేశారని పోలీసులు తెలిపారు. నటి గెహనా వశిష్ట్​తో కలిసి పలు చిత్రాల్లో ఆమె నటించారు.2023లో విడుదలైన ఆమ్రాస్ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు ఉందని ఫిల్మ్ సైట్ ఐఎండీబీ తెలిపింది. గతంలో వ్యభిచారానికి సంబంధించిన కేసులో రియా బర్డేను ముంబైలో పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.

More from Filmibeat

Read more about: riya arvinda barde bangladesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X