»   » అప్పుకట్టని నాగార్జున: అన్నపూర్ణ స్టూడియో స్వాధీనం?

అప్పుకట్టని నాగార్జున: అన్నపూర్ణ స్టూడియో స్వాధీనం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వందల కోట్ల ఆస్తులు ఉన్న ప్రముఖ నటుడు నాగార్జున్ అండ్ ఫ్యామిలీకి రూ. 62 కోట్ల అప్పు చెల్లించడం కష్టంగా మారిందా? అప్పు కట్టని కారణంగా అన్నపూర్ణ స్టూడియోస్ కు సంబంధించిన 7 ఎకరాల స్థలాన్ని బ్యాంకు వారు స్వాధీనం చేసుకుంటున్నా మిన్నకుండి పోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

అన్నపూర్ణ స్టూడియోస్‌కు సంబంధించిన 7.5 ఎకాల స్థలాన్ని ఈ నెల 20న స్వాధీనం చేసుకున్నట్లు ఆంధ్రా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ సంయుక్తంగా ప్రముఖ తెలుగు దిన పత్రికలో ఓ ప్రకటన జారీ చేసారు. మొత్తం వడ్డీతో కలిసి వీరు బ్యాంకుకు రూ. 62 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది.

Banks Seize Annapurna Studios's 7 Acres!

2/1/2014న బ్యాంకు వారు నోటీసులు కూడా జారీ చేసారు. 60రోజుల్లోపు కట్టాల్సిందిగా అన్నపూర్ణ స్టూడియోస్ కి గత యేడాది నోటీసులు పంపించారట బ్యాంకు అధికారులు. సంవత్సరం దాటినా ఆ నోటీసుకు వారు స్పందించలేదు. దాంతో 7.5ఎకరాలను హ్యాండోవర్ చేసుకోవాల్సి వచ్చిందిని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.

ఈ లోన్ కి గ్యారంటీయర్లుగా నాగార్జున, సుప్రియ, వై.సురేంద్ర పేర్లు ఉండగా, నాగసుశీల, వెంకట్ రొడ్డం, నిమ్మగడ్డ ప్రసాద్, అన్నపూర్ణ స్టూడియోతో కలిసి లోన్ తీసుకున్నవారి జాబితాలో ఉన్నారు. ఈ వ్యవహారం వెనక పెద్ద స్టోరీనే ఉందని స్పష్టమవుతోంది. అయితే నాగ్ అండ్ కో మాత్రం ఈవిషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలో అన్ని విషయాలు వెల్లడికానున్నాయి.

English summary
Andhra Bank and Indian Bank carried an advertisement in 'Eenadu' today in which the banks stated that they had taken over the 7.25 acres land of Annapurna Studios on the 20th of this month as the latter has defaulted on the payment of loans and interest to the tune of nearly Rs 62 crore.
Please Wait while comments are loading...