'చెడుగుడు' ఆడుస్తానంటున్న వారస హీరో...

By Staff
Banu Chandar
హీరోగా,క్యారెక్టర్ యాక్టర్ గా సుపరిచితమైన భానుచందర్ తన కుమారుడు జయంత్ ని 'చెడుగుడు' అనే హాస్య చిత్రం ద్వారా తెరంగ్రేటం చేయిస్తున్నారు. బ్రహ్మానందం,కోవైసరళ ప్రధానపాత్రల్లో కనిపించే ఈ సినిమా ద్వారా పి.ఆర్.నాగరాజు అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. నిధి ప్రసాద్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఈ దర్శకుడు కామిడీతో నవ్వించి ప్రేక్షకులతో చెడుగుడు ఆడుకుంటానంటున్నాడు. ఈ సినిమా కథ ఎప్పుడూ గొడవలు జరిగే వెంకట్ రాజ అనే గ్రామంలో ప్రారంభమవుతుంది. అక్కడ పోలీస్ స్టేషన్లో జంట కానిస్టేబుల్స్ గా బ్రహ్మానందం,కోవైసరళ పనిచేస్తూంటారు. లేచిపోయి ఆ ఊరు వచ్చిన హీరో,హీరోయిన్లతో గొడవలు మరింత పెరుగుతాయి. వాటిని కామిడీగా హాస్య జంట ఎట్లా సరిదిద్దారన్నదే సినిమా. దసరా కి రిలీజ్ అయ్యే ఈ సినిమాలో చెన్నై అమ్మాయి శ్వేత హీరోయిన్ గా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X