twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #BanVamsiShekarPRO: ముదిరిన నాట్యం వివాదం.. లక్షలు దండుకొని కక్ష కట్టారు.. పీఆర్వో వంశీ,శేఖర్‌పై రేవంత్

    |

    నాట్యం సినిమా వివాదం ముదిరి పాకాన పడుతున్నట్టు కనిపిస్తున్నది. కొద్ది రోజులుగా టాలీవుడ్ పీఆర్వో వంశీ, శేఖర్‌పై తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తూ నాట్యం డైరెక్టర్ రేవంత్ కోరుకొండ సినీ ప్రముఖులను, మా అధ్యక్షుడు విష్ణు మంచు, సినీ నిర్మాతల మండలి, ఇతర సినీ సంఘాలకు ఫిర్యాదు చేయడం సినిమా పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇటీవల మంచు విష్ణును, డైరెక్టర్ యూనియన్ ఎన్ శంకర్, ప్రొడ్యూసర్ యూనియన్ కౌన్సిల్ మధు, ప్రసన్నను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం నాట్యం సినిమాపై వంశీ, శేఖర్ చేసిన దుష్ప్రచారంపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో రేవంత్ కోరుకొండ చెప్పిన విషయాలు ఏమిటంటే?

    నా పేరు రేవంత్ కోరుకొండ. నేనే నాట్యం డైరెక్టర్‌ను. అక్టోబర్ 22వ తేదీన నేను దర్శకత్వం వహించిన నాట్యం సినిమా రిలీజైంది. ఈ సినిమా విడుదల తర్వాత నన్ను ఓ విషయం తీవ్రంగా కలత చెందేలా చేసింది. అది చెప్పే ముందు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలని ఉంది. నేను ఏ మీడియాపై విమర్శలు, ఆరోపణలు చేయడం లేదు. ఏ రివ్యూను తప్పబట్టడం లేదు. కేవలం వంశీ శేఖర్ అనే పీఆర్వోల గురించి చెప్పాలనుకొంటున్నాను. మిగితా పీఆర్వోల గురించి నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. పీఆర్వో అంటే సినిమా యూనిట్‌కు, మీడియాకు మధ్యవర్తి మాత్రమే. వంశీ, శేఖర్ మా సినిమాకు పీఆర్వోగా పనిచేశారు. మా సినిమా ప్రమోషన్ సందర్భంగా అన్నీ తప్పుడు బిల్లులు ఇచ్చి భారీగా డబ్బు తీసుకొన్నారు. మా నుంచి డబ్బు తీసుకొని ప్రమోషన్స్‌కు ఖర్చు పెట్టకుండా దుర్వినియోగానికి పాల్పడ్డారు అని నాట్యం డైరెక్టర్ రేవంత్ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.

    #BanVamsiShekarPRO: Natyam Director Revanth Korukonda allegations on PRO Vamsi Shekhar

    వంశీ, శేఖర్‌పై నేను నిరాధార ఆరోపణలు చేయడం లేదు. సినిమా రిలీజ్‌కు ముందు మా వద్దకు వచ్చి.. మీ సినిమాకు ప్రమోషన్స్ చేస్తామని ఎక్సైట్ మెంట్ క్రియేట్ చేశారు. మేము పెద్ద సినిమాలతోపాటు మీలాంటి సినిమాలను ప్రమోట్ చేస్తే మాకు మరింత గుర్తింపు వస్తుంది. మీరు ఎంత ఇస్తే అంత తీసుకొంటాం. మనం వెంటనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని హడావిడి సృష్టించడంతో వాళ్లను మేము పీఆర్వోలుగా పెట్టుకొన్నాం. ప్రమోషన్ మొదలైన తర్వాత వాళ్లు ముందు చెప్పినట్టు కాకుండా మరో రకంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఏవో బిల్లులు ఇచ్చి డబ్బులు ఇవ్వమని చెప్పారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే.. మీరు ప్రమోషన్స్‌కు డబ్బులు ఇవ్వరా? ప్రమోషన్స్ చేయవద్దా అని గొడవ పడ్డారు. దాంతో గొడవ ఎందుకని మేము డబ్బులు ఇచ్చాం. అయితే మేము ఇచ్చిన డబ్బులు ప్రమోషన్స్‌కు ఉపయోగించడం లేదనే విషయం తెలిసి వాళ్లను అడిగితే, మాతో మరోసారి గొడవపడ్డారు అని రేవంత్ కోరుకొండ ఆవేదన వ్యక్తం చేశారు.

    #BanVamsiShekarPRO: Natyam Director Revanth Korukonda allegations on PRO Vamsi Shekhar

    నాట్యం సినిమా రిలీజ్‌కు ముందు మీడియా రిపోర్టర్లను కల్పించండి. మేము వారి సపోర్ట్ కోరుతాం అంటే లేదు. వాళ్లు మిమ్మల్ని కలవరు. మేమే వారికి కలిసి ప్రమోషన్స్ చేస్తామని మరింతగా, భారీగా డబ్బు డిమాండ్ చేశారు. కొన్ని ప్రైవేట్ వెబ్‌సైట్ల పేరు చెప్పి లక్షల్లో డబ్బు తీసుకొన్నారు. డబ్బు తీసుకొన్న తర్వాత సదరు వెబ్‌సైట్స్ మీ సినిమాకు వ్యతిరేకం రాస్తే మేము బాధ్యులం కాదని చెప్పారు. అంతేకాకుండా నాపై కక్ష్య కట్టి వాళ్లు చెప్పిన వెబ్‌సైట్స్‌లోనే సినిమా గురించి తప్పుడు రివ్యూలు, నాపై దురద్దేశపూర్వకంగా రాతలు రాయించారు అని రేవంత్ కోరుకొండ ఆరోపించారు.

    నాట్యం సినిమా రిలీజైన గంటల్లోనే మా మూవీకి వ్యతిరేకంగా తొమ్మిది వెబ్‌సైట్లు తప్పుడు రివ్యూలు రాశారు. వంశీ, శేఖర్ చెప్పిన వెబ్‌సైట్లు, వాటి కోసం తీసుకొన్న డబ్బుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఎవరైనా అడిగితే చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ కొన్ని ప్రధాన మీడియాకు సంబంధించిన వెబ్‌సైట్స్, ప్రొఫెషనల్ జర్నలిస్టులు పాజిటివ్‌గా మా సినిమాను ప్రశంసించారు. కేవలం వంశీ, శేఖర్ కంట్రోల్‌లో ఉండే మీడియా మాత్రమే మాపై విషం చిమ్మింది అంటూ రేవంత్ కోరుకొండ ఆవేదన వ్యక్తం చేశారు.

    #BanVamsiShekarPRO: Natyam Director Revanth Korukonda allegations on PRO Vamsi Shekhar

    నేను తొలిసారి దర్శకత్వం చేయాలని నిర్ణయించుకొన్నప్పుడు ఒక మంచి సినిమా తీశాను. నాట్యం అనే కథను, మంచి కాన్సెప్ట్‌తో ఓ మంచి సినిమా తీయాలి. మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని తపన పడ్డాను. నాలుగు సంవత్సరాలు కష్టపడి ఓ సినిమా తీస్తే.. వంశీ, శేఖర్ లాంటి వాళ్లు నా జీవితాన్ని గంటలో డిసైడ్ చేస్తారా? ఏ సినిమానైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలి? ఆ సినిమా తీసిన డైరెక్టర్, హీరో, యూనిట్ తమ కష్టాన్ని చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా సినిమాను గంటలోనే చంపాలని చూడటం సరికాదు అనే విధంగా రేవంత్ ఆవేదన చెందారు.

    వంశీ, శేఖర్ నా మీద చేసిన దుష్ప్రచారం, కక్ష్యతో నేను మనోవేదనకు గురయ్యాను. నాకు జరిగిన అన్యాయానికి తలదించుకొని తప్పు అని వెళ్లిపోవడానికి నా మనసాక్షి ఒప్పుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితులు చూస్తే నాకు భయం వేస్తున్నది. సినిమా వల్ల ఏదైన జరిగితే మనోభావాలు దెబ్బతిన్నాయని అందరూ ఎటాక్ చేస్తారు. సినిమా వాడికి అన్యాయం జరిగితే అది ఎంత కామన్ సమస్య అయినా.. అది వాడి ఒక్కడి ప్రాబ్లెం అవుతున్నది. ఈ ఫేక్ రివ్యూస్ అనేది నా ఒక్కడి సమస్య కాదు. సినిమా పరిశ్రమలోని ప్రతీ ఒక్కరి సమస్య. కాబట్టి నేను కొత్త దర్శకుడినైనా అందరి తరఫున మాట్లాడుతున్నాను. ఇండస్ట్రీలో చిన్న సినిమాలే ఎక్కువ. చిన్న నిర్మాతలు, దర్శకులు భయంతో వీళ్ల కంట్రోల్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలానే కొనసాగితే.. రేపు పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు అన్నీ కూడా వీళ్ల చేతుల్లో వెళిపోతుంది. కొన్ని ప్రైవేట్ వెబ్‌సైట్ల ప్రభావంతో మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి బ్యాన్ ఫేక్ రివ్యూస్, బ్యాన్ వంశీ, శేఖర్ పీఆర్వో, సపోర్ట్ నాట్యం అంటూ రేవంత్ కోరుకొండ వీడియోను రిలీజ్ చేశారు.

    English summary
    Natyam Director Revanth Korukonda allegations on Vamsi Shekhar. He alleges that, I, Revanth Korukonda, debutant director of the movie Natyam (2021), released on October 22nd and produced by Nishrinkala production house, regret to inform that P.R.O's Vamshi Shekar are misusing their prowess to malign my film and me by inciting negative reviews.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X