వెండితెరపై మహాత్మా గాంధీ ముని మనవడు
మొన్నా మధ్య కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన మహాత్మా(శ్రీకాంత్, భావన) చిత్రం ఆడియో పంక్షన్ కు గెస్ట్ గా విచ్చేసిన తుషార్ గాంధీ త్వరలో వెండి తెరపై కనిపించనున్నారు. తుషార్ గాందీ జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవడు అన్న సంగతి తెలిసిందే. గాంధీ మహాత్ముడి సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్న 'రోడ్ టు సంగం' అనే చిత్రంలో తుషార్ నటిస్తున్నారు. అమిత్‌రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు పరేష్ రావల్, ఓంపురి, పవన్ మల్హోత్రా, స్వాతి చిట్నిస్ తదితరులు వివిధ పాత్రలు పోషించారు. ఈనెల 29న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం పబ్లిసిటీ కాంపయిన్ లో తుషార్ గాందీ విరివిగా పాల్గొనే ఆవకాశం ఉంది. అలాగే తన తాతగారి సిద్దాంతాలను గానీ, జీవిత చరిత్రలను గానీ అనుసరించి చేస్తున్న చిత్రాలలో తాను నటించటానికి ముందుకు వస్తానని ఆయన తెలియచేసారు. సినిమా అనేది గొప్ప మీడియం అని దాని ద్వారా గాంధీ సిద్దాంతాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళే అవకాశం కలుగుతుందని దానని తాను వదులుకోలదల్చుకోలనని ఆయన మీడియా వారు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











