బాపు పట్ల ప్రభుత్వంపై బ్యాడ్‌గా... : త్రివిక్రమ్
హైదరాబాద్: ఇటీవల స్వర్గస్తులైన దర్శకుడు బాపు గురించి తెలుగు డైరెక్టర్ త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అయింది. ‘అతడు' సినిమా తీస్తున్నపుడు బాపు గారిని కలిసానని చెప్పిన త్రివిక్రమ్ అందుకు సంబంధించిన అనుభవాలను మీడియాతో షేర్ చేసుకున్నారు.
‘నేను అతడు సినిమా చేస్తున్నపుడు బాపు, రమణ హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉండే వారు. బాపు గారు గొప్ప ఆలోచనా పరులు. గొప్ప ప్రతిభాశాలి. ఆయన గొప్ప చిత్రకారుడు. సినిమాలకు సంబంధించి ఆయన ఆలోచన విధానం నాకు చాలా నచ్చింది. అతడు షూటింగ్ సమయంలో ఎన్నో సాయంత్రాలు ఆయనతో గడిపాను' అని తెలిపారు.

తన జీవిత కాలంలో బాపుగారు ఎన్నో లక్షల కార్టూన్లు గీసారు. సినీ రంగానికి ఎనలేని సేవ చేసారు. హార్డ్ వర్క్, క్రమ శిక్షణ వల్లే ఆయన సక్సెస్ అయ్యారు. బాపు, రమణ 66 ఏళ్ల పాటు ఎలాంటి విబేదాలు లేకుండా స్నేహితులుగా ఉండటం ఎంతో గొప్ప విషయం అని త్రివిక్రమ్ అన్నారు.
‘చిత్రకారుడిగా, సినీ దర్శకుడిగా బాపుగారు ఆయా రంగాలకు ఎంతో సేవ చేసారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆయన్ను బ్యాడ్‌గా ట్రీట్ చేసింది. కనీసం పద్మ విభూషణ్ కూడా ఇవ్వ లేదు. పద్మ శ్రీ కూడా చాలా లేటుగా ఇచ్చారు' అంటూ త్రివిక్రమ్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











