Don't Miss!
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
FCUK ప్రమోషన్ డోస్ మామూలుగా లేదు.. బారసాల అంటూ వినూత్నమైన వేడుక
సీనియర్ నటుడు జగపతిబాబు ఎంచుకుంటున్న సినిమాలు ఎంత డిఫరెంట్ గా ఉంటున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కేవలం సపోర్టింగ్ రోల్స్ లోనే కకుండా లీడ్ రోల్స్ తో కూడా సర్ ప్రైజ్ ఇస్తున్నారు. జగపతిబాబు మెయిన్ లీడ్ లో రామ్ కార్తీక్-అమ్ము అభిరామి యువ జంటగా, మరో కీలక పాత్రలో బేబి సహశ్రిత నటించిన సినిమా ఎఫ్‌సీయూకే.
కాస్త డిఫరెంట్ గా ఉంటుందని నేటి ట్రెండ్ కు తగ్గట్లుగా ఈ టైటిల్ ను సెట్ సిగేశారు. ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్ అనేది సినిమా టైటిల్ అర్థం. ఇక చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు ముస్తాబవుతోంది. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించారు. అయితే సినిమా ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
శనివారం ఈ సినిమా బారసాల వేడుక జరగనుందట. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసిన సీజీత్ర యూనిట్ అసలు క్లారిటీ ఇచ్చింది. బారసాలను ప్రి రిలీజ్ ఈవెంట్‌కే ఆ పేరు పెట్టినట్లు అర్థం చేసుకొన్నారు. ఆ రోజు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ చిత్రంలోని నాలుగు ప్రధాన పాత్రధారులకు సంబంధించిన ఫస్ట్ లుక్స్, వారి క్యారెక్టర్లను పరిచయం చేస్తూ టీజర్‌ను రిలీజ్ చేశారు.
అప్పుడే సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది ముఖ్యంగా టీజర్లో జగపతిబాబు కనిపించిన తీరు అందరిలోనూ క్యూరియాసిటీని కలిగించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో యంగ్ హీరోకు ఫాదర్‌గా టైటిల్ రోల్ చేసిన జగపతిబాబు క్యారెక్టర్‌లోని రొమాంటిక్ యాంగిల్ ను చూపిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఫ్యామిలీ హీరోగా పేరుపొందిన ఆయన చాలా కాలం తర్వాత రొమాంటిక్ బోల్డ్ రోల్ చేయడం హాట్ టాపిక్ గక్ మారింది. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.