తన సీక్రెట్ ఎఫైర్‌ను లీక్ చేసిన ఇలియానా
హైదరాబాద్ : సౌత్ సినీ ఇండస్ట్రీలో కొంత కాలం ఇలియానా టాప్ పొజిషన్లో కొనసాగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ గోవా సుందరిని పలు ప్లాపులు ముంచెత్తడంతో వెనకబడి పోయింది. ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ తో కలిసి 'బర్ఫీ' చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం 'బర్ఫీ' చిత్రం ప్రమోషన్లలో పాల్గొంటున్న ఇలియానా...ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సీక్రెట్ లవ్ ఎఫర్ గురించి బయట పెట్టింది. తనకు గతంలో ఓ యాక్టర్‌తో లవ్ ఎఫైర్ ఉండేదని, అయితే అతనితో జీవితాంతం సంతోషంగా ఉంటాననే నమ్మకం లేక పోవడంతో ఇద్దరం విడిపోయామని, ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉంటున్నానని వెల్లడించింది. అయితే అతను ఎవరు? అనే విషయం మాత్రం చెప్పడం లేదు ఈ బక్క పలుచని సుందరి.
ఇలియానాకు పలువురు హీరోలతో సం'బంధం' ఉన్నట్లు గతంలో చాలా గాసిప్స్ వినిపించాయి. అయితే వారిలో ఎవరు ఆమెతో సీక్రెట్ ఎఫైర్ నడిపారు అనే విషయమై ఇండస్ట్రీ జనాలు ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఇలియానాతో ప్రేమ వ్యవహారం నడిపినదెవరో వెల్లడయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఇలియానా నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ బర్ఫీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలో ఈచిత్రం విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇక షాహిద్ కపూర్ హీరోగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందనున్న 'Phata Poster Nikla Hero' చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా సెలక్టయింది. వన్స్ అపానే టైమ్ ముంబై-2 చిత్రంలోనూ ఇలియానా సెలక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా అపీషియల్ సమాచారం వెలువడలేదు.


Click it and Unblock the Notifications











