twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బర్ఫీ' అవుట్...ఇలియనాకు తీవ్ర నిరాశ

    By Srikanya
    |

    ముంబై : ఆస్కార్‌ బరిలో మన దేశ చిత్రం 'బర్ఫీ' నిలవలేకపోయింది. తుది జాబితాలో చోటు సంపాదించలేక వెనుదిరిగింది. ఉత్తమ విదేశీభాష చిత్రం విభాగం నుంచి మన దేశం తరఫున అధికారిక చిత్రంగా 'బర్ఫీ'ని పంపించారు. రణ్‌బీర్‌ కపూర్‌, ప్రియాంక చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. అనురాగ్‌ బసు దర్శకుడు. దాంతో ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుుకన్న ఇలియానాకు తీవ్ర నిరాశ ఎదురైనట్లైంది.

    ప్రపంచవ్యాప్తంగా 71 చిత్రాలు ఈ ఉత్తమ విదేశీభాష చిత్రం విభాగంలో పోటీపడ్డాయి. అయితే వీటి నుంచి తొమ్మిది చిత్రాల్ని ఎంపిక చేశారు. అందులో 'బర్ఫీ'కి స్థానం దక్కలేదు. వీటి నుంచి మళ్లీ ఐదు సినిమాల్ని తుది పోటీకి ఎంపిక చేస్తారు. మన దేశంలో 'బర్ఫీ' సినిమాకి మంచి వసూళ్లే దక్కాయి. అయితే ఆస్కార్‌కి వెళ్లేంత స్థాయి లేదని తొలి నుంచీ విమర్శలు వచ్చాయి. నోట్‌బుక్‌, లవర్‌ కాన్సెర్ట్‌, ఒయాసిస్‌ లాంటి విదేశీ చిత్రాల్లోని సన్నివేశాల ప్రభావం 'బర్ఫీ'పై ఉందని విమర్శకులు ప్రస్తావించారు. అలాగే చార్లీ చాప్లిన్‌, బస్టర్‌ కీటన్‌ల సినిమాల స్ఫూర్తితో అందులోని వినోదాత్మక సన్నివేశాల్ని అల్లారని విమర్శలొచ్చాయి.

    ఆస్కార్ అవార్డ్స్ విభాగంలో 'ఉత్తమ విదేశీ చిత్రం' విభాగానికి సంబంధించిన నామినేషన్ కోసం మన భారతదేశం నుంచి ఒక సినిమాని ఎంపిక చేసింది ఎఫ్‌ఎఫ్‌ఐ. వివిధ భారత భాషల్లో రూపొందిన దాదాపు 20 చిత్రాలను వీక్షించారు. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆస్కార్‌ జ్యూరీ ఛైర్‌పర్సన్‌ మంజు బోరా మాట్లాడుతూ ''మొత్తం 20 ఎంట్రీలు వచ్చాయి. వాటిలో 'బర్ఫీ' చిత్రాన్ని ఎంపిక చేశాం. మానవ సంబంధాలకు ప్రాధాన్యమున్న చిత్రమిది. మన దేశం స్థితిగతుల్ని కూడా ప్రతిబింబించేలా తెరకెక్కించారు. అందుకే ఈ సినిమాని ఎంపిక చేశాము. మేం చూసిన అన్ని చిత్రాలు బాగున్నాయి. కానీ అకాడమీ అవార్డ్స్ కమిటీ నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆ మేరకు 'బర్ఫీ'ని ఎంపిక చేశాం. ఆస్కార్ నామినేషన్‌కు పంపించడానికి సినిమా కథ, నాణ్యత ముఖ్యం. 'బర్ఫీ'లో ఇవి మెండుగా ఉన్నాయి. మానవీయ విలువలను అద్భుతంగా చూపించిన చిత్రం ఇది'' అన్నారు.

    ఇలియానా మాట్లాడుతూ...'బర్ఫీకోసం తాను మంచి మంచి అవకాశాలను వదులుకున్నానని, గ్లామర్ లేకపోయినా తన ఫిజిక్ చక్కగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నానని, తన కెరీర్‌లోనే ఓ గొప్ప విజయంగా బర్ఫీని చెప్పుకుంటానని తెలిపింది. కమర్షియల్‌గా ఈ కథ విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు తప్పక లభిస్తాయని తనకుముందే తెలుసని, అయితే ప్రేక్షకులు ఈ చిత్రానికి ఇంత విజయం అందించడం మాత్రం సరికొత్తగా ఉందని, ఈ చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉంది అని అంటోంది.

    English summary
    ‘Barfi’ is out of race for the best foreign language film category for the 85thAcademy Awards. The movie is starred by Ranbir Kapoor as deaf and mute boy and actress Priyanka Chopra as an autistic girl. Actress Ileana has also played lead role in the movie. Actress Ileana also got good reputation at the international level with this movie. Out of 71 films that qualified for the Oscars nomination from across the world, only nine have been shortlisted which will further compete to make it to the final five nominations. The final list will be announced on January 10th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X