Pawan Kaylan పవన్ కల్యాణ్ గ్రేట్ పర్సన్.. డబ్బు దాచుకోవడం తెలియదు.. ఏపీ సీఎంకు బర్రెలక్క కౌంటర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం లేపాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసి తెచ్చుకొన్న ఓట్లపై ఏపీ సీఎం ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష కంటే తక్కువ ఓట్లు తెచ్చుకొన్నారని అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇటీవల బర్రెలక్క మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌కు హిత బోధ చేసే ప్రయత్నం చేయడం వైరల్‌గా మారింది. బర్రెలక్క మాట్లాడిన విషయాల్లోకి వెళితే..

రాజకీయాల్లో ఎవరి పార్టీ వారిది. ఎవరి జీవితం వారిది. కానీ పవన్ కల్యాణ్‌ను తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. ఏపీ సీఎం అలా మాట్లాడటం నాకు బాధేసింది. ఆయన పవర్ ఆయనది. నా పవర్ నాది. పవన్ కల్యాణ్ ఎంత మంచి వారనేది అందరికి తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ బర్రెలక్క అలియాస్ శిరీష అభిప్రాయపడ్డారు.

Barrelakka Alias Shirisha sharp counter to AP CM YS Jagan over comments on Pawan Kalayn

పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తితో నన్ను పోల్చడం సరికాదు. అలాంటి ప్రముఖ వ్యక్తితో నన్ను పోల్చడం బాధేసింది. అందుకే ఏపీ సీఎం వ్యాఖ్యలపై నేను స్పందించబోను. కానీ పవన్ కల్యాణ్ గ్రేట్ పర్సన్. ఆయనకు నేను అభిమానిని. ఆయనను తక్కువ చేయడానికి నా పేరు వాడుకోవడం సరికాదు అని బర్రెలక్క అన్నారు.

పవన్ కల్యాణ్‌తో పోల్చడం హ్యాపీగా ఉంది. ఆయన ప్రజలకు కోసం ఎలాంటి పోరాటం చేస్తున్నారో అందరికి తెలుసు. పవన్ కల్యాణ్‌కు డబ్బు వెనుక వేసుకోవడం తెలియదు. ఆయన కూడా ప్రజాసేవ చేయాలని పోరాటం చేస్తున్నారు. ఓడిపోయామని బాధపడకూడదు. ఓటమితోనే గెలుపు సాధ్యమవుతుంది అని బర్రెలక్క అన్నారు.

బర్రెలక్క అలియాస్ శిరీష విషయానికి వస్తే.. కేసీఆర్ ప్రభుత్వం జాబ్ నోటికేషన్ల విషయంలో వైఫల్యం పొందిందనే విమర్శలతో ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల్లో ముచ్చెటమలు పట్టించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X