చిరు కాళ్లు మొక్కిన గౌతం, బ్రహ్మీ కన్నీళ్లు (ఫోటోలు)
హైదరాబాద్: టాలీవుడ్ కామెడీ డాన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతం నటిస్తున్న చిత్రం 'బసంతి'. బసంతి సినిమాను హిట్ చేయాలనే ఉద్దేశ్యంతో బ్రహ్మానందం పత్ర్యేకమైన కేర్ తీసుకుంటున్నారు. తన పలుకుబడి ఉపయోగించి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పెద్ద పెద్ద స్టార్లందరితో 'బసంతి' సినిమాను ప్రమోట్ చేయిస్తున్నారు.
ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'బసంతి' ఆడియో విడుదల చేపట్టిన బ్రహ్మానందం....ఇండస్ట్రీలోని ఇతర స్టార్ హీరోలైన మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, మంచు విష్ణు తదితరులతో పాటలు ప్రోమోలు, ట్రైలర్లు, ఫోటోలు విడుదల చేయించారు.
తాజాగా బ్రహ్మానందం తన బాస్ చిరంజీవి దగ్గరికి రాజా గౌతంను తీసుకెళ్లారు. చిరంజీవిగా ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడూతే గౌతం నా కొడుకు లాంటి వాడు, చరణ్‌కు సక్సెస్ వస్తే నేను ఎంత సంతోష పడతానో, గౌతం సినిమా హిట్టయినా అంతే సంతోష పడతాను అని చెప్పడంతో.....బ్రహ్మానందం ఎమోషన్ అయ్యారు. ఆయన కంట ఆనంద బాష్పాలు పెళ్లుబుకాయి. అందుకు సంబంధించని ఫోటోలు, మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

చిరంజీవి మాట్లాడుతూ...
గౌతం నాకు కొడుకు లాంటి వాడు, చరణ్ కు సక్సెస్ వస్తే ఎంత సంతోష పడతానో గౌతం సినిమా హిట్టయినా అంతే సంతోష పడతాను. బసంతి టీం సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

మణిశర్మ గురించి చిరంజీవి...
మణి శర్మ నా సినిమాలతో పాటు చరణ్ సినిమాలకు సక్సెస్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయన నా సినిమాకు కంపోజ్ చేసిన యమహా నగరి పాట ఎవర్ గ్రీన్‌గా నిలిచి పోయింది అన్నారు.

దర్శకుడు చైతన్య గురించి...
దర్శకుడు చైతన్య దంతులూరి గురించి చిరంజీవి మాట్లాడుతూ...ఆయన తొలి సినిమా బాణం ఎంతో బాగుంది. ఆయన దర్శకత్వంలో వస్తున్న బాణం చిత్రం కూడా సక్సెస్ అవుతుందనే నమ్ముకం ఉంది అన్నారు.

చిరంజీవి ఆశీర్వాదం
చిరంజీవికి పాదాభివందం చేసి ఆశీర్వాదం చేసుకుంటున్న రాజా గౌతం. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ‘బసంతి' చిత్రం సక్సెస్ కావాలని ఆకాక్షించారు.

బ్రహ్మానందం ఆనంద బాష్పాలు
కేంద్ర మంత్రిగా ఎంతో బిజీగా ఉండే చిరంజీవి తమకోసం సమయం కేటాయించి తన కుమారుడిని ఆశీర్వదించడం, సినిమా సక్సెస్ కావాలని కోరుకోవడంతో....బ్రహ్మానందం కంట ఆనంద బాష్పాలు రాలాయి.

బ్రహ్మీ ముందు గౌరవంగా చిరు...
బ్రహ్మానందం ముందు చేతులు కట్టుకుని చిరంజీవి ఇలా సరదాగా కనిపించారు. దీన్ని బట్టి బ్రహ్మానందం, చిరంజీవి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఫోటోలకు ఫోజులు
చిరంజీవి, బ్రహ్మానందం, రామ్ చరణ్, రాజా గౌతం కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

బ్రహ్మానందంతో సరదాగా రామ్ చరణ్
బ్రహ్మానందంతో సరదాగా చిట్ చాట్ చేస్తున్న రామ్ చరణ్. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇలా నవ్వుకున్నారు.

బసంతి టీంకు రామ్ చరణ్ బెస్టాఫ్ లక్
బసంతి టీంకు సక్సెస్ అందాలని కోరుకుంటూ బెస్టాఫ్ లక్ చెబుతున్న రామ్ చరణ్....

బ్రహ్మానందం మా బ్రదర్
బ్రహ్మానందం మా ఫ్యామిలీలో ఒకడి లాంటి వారు, నాకు బ్రదర్ లాంటి వాడు. బసంతి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు చిరంజీవి.

రామ్ చరణ్ మాట్లాడుతూ...
రాజా గౌతం నాకు బ్రదర్ లాంటి వాడు. ఇద్దరు కలిసి జిమ్నాస్టిక్స్ క్లాసులకు వెళ్లే వాళ్లం. గౌతంలో నటిడిగా మంచి పొటెన్షియల్ ఉంది. బసంతి చిత్రం పెద్ద హిట్టవుతుందని నమ్ముతున్నాను అన్నారు.

బసంతి
‘బాణం' దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో బ్రహ్మానందం కుమారుడు హీరోగా 'బసంతి' టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ టైటిల్ కి A lovestory between a kite and a flight అనే ఇంట్రస్టింగ్ క్యాచీ లైన్ పెట్టారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

బసంతి స్టోరీలైన్
సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో నుంచి పుట్టిందే ఈ బసంతి కథ. కళాశాలలో అడ్మిషన్ తీసుకోగానే ప్రతి స్టూడెంట్‌కి ఒక గుర్తింపు వస్తుంది. అంతే కాదు కళాశాల బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అందుకే కళాశాల జీవితం ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైనది. ‘బసంతి కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌స అండ్ సైన్స్'లో చదివే విద్యార్థుల కథే ఈ బసంతి. అర్జున్‌గా రాజా గౌతమ్ విద్యార్థి పాత్రలో కనిపిస్తాడు.

ఇతర పాత్రలు
ఇతర ప్రధాన పాత్రల్లో తనికెళ్ల భరణి, షాయాజీషిండే, రణధీర్ గట్ల, నవీన జాక్సన్, డా.కె.ఎస్.ఐ.ఆనంద్, ధన్‌రాజ్, మణి కిరణ్, భాను ఆవిర్నేని, దయ నటిస్తున్నారు.

టెక్నీషియన్స్
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, పాటలు: కృష్ణ చైతన్య, శ్రీమణి, కెమెరా: అనీల్ భండారి, మాటలు: శ్రీకాంత్ విస్సా, నృత్యాలు: రఘు, ఆర్ట్: రఘు కులకర్ణి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల, కథ, కధనం, నిర్మాత, దర్శకత్వం: చైతన్య


Click it and Unblock the Notifications











