ఆధారంలేని గాసిప్స్ అంటూ మహేష్ ఖండన
మిగతా వాళ్ల సంగతి నాకు తెలియదు.. వాళ్ళ మీద కామెంట్ చెయ్యటం పద్దతి కాదు..కానీ నేను పాలిటిక్స్ రావటం అనేది నాకు ఎప్పుడూ ఇంట్రస్ట్ లేని విషయమే. నటనే నా మొదటి, చివరి ఛాయిస్. నాకు రాజకీయాల్లో ఎబిసి లు కూడా తెలియవు. కాబట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండటమే బెస్ట్. అయినా కూడా నేను రాజకీయాల్లోకి వెళ్లితే.. నా నాలుగేళ్ళ కొడుకుని రాజకీయాల్లోకి తీసుకెళ్లితే ఎలా ఉంటుందో అలాంటి రిజల్ట్ వస్తుంది అని తేల్చి చెప్పారు మహేష్ బాబు. అలాగే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని వస్తున్నాను,నన్ను సంప్రదిస్తున్నారు వంటి వన్నీ అర్దంలేని,ఆధారం లేని రూమర్స్ మాత్రమే అన్నారు.
ఆయన మీ తోటి చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారు కదా.. మీరు అలాగే పాలిటిక్స్ లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వినిపిస్తోంది అని ఓ ఇంగ్లీష్ డైలీ అడిగితే ఆయన ఇలా స్పందించారు. ఇక తన భార్య ప్రెగ్నిన్సీ గురించి అడిగితే.. తానే ఈ నెలాఖరుకు ఆ విషయమై మీడియాకు చెప్తాను అన్నారు. అలాగే తను ప్రస్తుతం తన సంక్రాతి విడుదల బిజినెస్ మ్యాన్ పైనే దృష్టి ఉందని అన్నారు. దూకుడు చిత్రం తర్వాత వస్తున్న ఈ గ్యాంగస్టర్ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications