ఆధారం లేని రూమర్ అది నమ్మద్దు: రాజమౌళి
రాజమౌళి చిత్రంలో కాజల్ ఐటం సాంగ్ చేయనున్నదనే వార్తలు అంతటా వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో దర్సకుడు రాజమౌళి అస్సలు నిజం వివరించటానికి ట్విట్టర్ ని ఆశ్రయించాడు. ఆయన ఏమని ట్వీట్ చేసాడంటే...కాజల్ ఈగ చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోందనే న్యూస్ వచ్చింది..అది నిజం కాదు..ఈగ సినిమాలో అస్సలు ఐటం సాంగ్ లే లేవు. అది కేవలం ఆదారం లేని రూమర్ మాత్రమే అని తేల్చేసారు. ప్రస్తుతం రాజమౌళి ఈగ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంధిల్ కెమెరా అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











