సెప్టెంబర్ 20 నుండి ‘బతుకమ్మ ఫిల్మ్‌ఫెస్టివల్ 2017’
సెప్టెంబర్ 20న బతుకమ్మ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం. ఈ నెల 27 వరకు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ సాగనుంది.
బతుకమ్మ వేడుకలు ప్రారంభం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతికశాఖ 'బతుకమ్మ ఫిల్మ్ ఫెస్టివల్' నిర్వహించనుంది. ఈనెల 20 నుంచి 27 వరకు రవీంద్రభారతి వేదికపై నిర్వహించే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలంగాణ నేపథ్యంతో వచ్చిన సినిమాలు, డాక్యుమెంటరీలను ప్రదర్శించనున్నారు.
అప్పట్లో ఒకడుండేవాడు, ఫిదా , జయమ్ము నిశ్చయమ్మురా, ఘాజీ, అర్జున్‌రెడ్డి సినిమాల ప్రదర్శన, అనంతరం ఆ సినిమా యూనిట్ సభ్యులతో టాక్ నిర్వహిస్తున్నామని భాషా సాంస్కృతికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రొఫెసర్ జయశంకర్ జీవిత విశేషాలు తెలిపే కాలజ్ఞాని, కరీంనగర్ జిల్లాలోని పర్యాటక కేంద్రమైన రామగిరి ఖిల్లా తెలంగాణ చరిత్రను వివిధ కాలాల్లోని సంఘటనలను వివరించే మరో డాక్యుమెంటరీని ఈ బతుకమ్మ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తారు.
ఈ చిత్రోత్సవాల కోసం 25 ఏళ్ల క్రితం ఉపయోగించిన ప్రివ్యూ థియేటర్‌కు మరమ్మతులు చేశారు. ఈ ఫిల్మోత్సవంలో దానిని పునర్‌ప్రారంభిస్తున్నట్టు భాష, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.


Click it and Unblock the Notifications