బ్యాట్‌మెన్ మూవీ కారు...ఎన్టీఆర్ ‘బాద్‌షా’లో!

By Bojja Kumar

హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రం ఈ నెల 5న విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర రచయితల్లో ఒకరైన కోన వెంకట్ తన ట్విట్టర్ ద్వారా ఓ ఆసక్తికర విషయం బయట పెట్టారు. హాలీవుడ్ మూవీ బ్యాట్‌మెన్ సినిమాలో ఉపయోగించే కారు ఫోటో ఫోస్టు చేసి దీన్ని 'బాద్ షా' చిత్రంలో హీరో ఎన్టీఆర్ వాడతారు అంటూ కామెంట్ చేసారు.

ఇంతకాలం ఎక్కడా ఈ కారు గురించి సమాచారం వెల్లడించని యూనిట్ సభ్యులు....ఏప్రిల్ 1వ తేదీన ఈ విషయం బయట పెట్టడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి నిజంగా 'బాద్ షా' చిత్రంలో ఈ కారు వాడారా? అందరినీ ఏప్రిల్ ఫూల్స్ చేయడానికి కోన వెంకట్ ఈ ఫోటో పోస్టు చేసారా? అనేది తేలాల్సి ఉంది.

'బాద్ షా' సినిమా వివరాల్లోకి వెళితే...ఈ నెల 5వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ సినిమా గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ ఈ సమ్మర్లో 'బాద్ షా' బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 5.09 గంటలకు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అన్నారు.

ఎన్టీఆర్, కాజల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో 50 మంది ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్, కె.వి.గుహన్, గోపీమోహన్, కోనవెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎంఆర్ వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X