రొమాంటిక్ హీరో సిద్దార్ధ ఫ్యాన్స్ కో శుభవార్త..

By Srikanya

సిద్దార్ద తాజా చిత్రం బావ ..ఆడియో అక్టోబర్ నాలుగున రిలీజ్ కానుంది. ఏం పిల్లదో..ఏం పిల్లడో చిత్రంతో పరిచయమైన ప్రణీత ఈ చిత్రంలో సిద్దార్ధ సరసన చేస్తోంది. తాజాగా సరదాగా కాస్సేపు చిత్రం నిర్మించిన ఎమ్.ఎల్.కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని తమ శ్రీ కీర్తి క్రియోషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇక సిద్దార్ధ నటించిన చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన రాంబాబు ఈ చిత్రంతో దర్శకుడుగా మారుతున్నారు. అలాగే ఈ చిత్రం నవంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం చక్రి అందించారు.

ఇక చిత్రం కథ గురించి దర్శకుడు చెబుతూ.. రాముడు, సీతలాంటి బావా మరదళ్ల మధ్య రావణాసురుడిలాంటి ఓ పాత్ర ప్రవేశిస్తుంది. అతను పెట్టే సమస్యలను, అవరోధాలను హీరో ఎలా అధిగమించి తన మరదలుని దక్కించుకుంటాడన్నదే పాయింటు అంటున్నారు దర్శకుడు రాంబాబు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రాజేంద్రప్రసాద్, సిద్ధార్థ నటిస్తున్నారు. అలాగే తన కొడుక్కి స్నేహితుడిలా, తండ్రిలా, గురువులా ఉంటూ, ఆ కొడుకు ప్రేమ కోసం రాజేంద్రప్రసాద్ ఏం చేశారన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి తండ్రి, కొడుకు ఇలాగే ఉండాలని కోరుకుంటారు చెప్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: చక్రి, ఫొటోగ్రఫీ: అరవింద్ కృష్ణ, సమర్పణ:సందీప్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X