తన భజన తానే చేసుకుంటున్న సిద్దార్ద
సిద్దార్ధ చేసిన బావ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. మార్నింగ్ షో కే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే సిద్దార్ధ మాత్రం ట్విట్టర్ లో ఈ చిత్రం గురించి ఊదరకొడుతున్నాడు. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఊహించని రీతిలో ఉన్నాయని, వీకెండ్ లో అదరిపోయిందని, అన్ని సెంటర్స్ లోనూ స్టడీగా సినిమా నడుస్తోందని, ఫీలింగ్ సూపర్ అని, తన నటనకు, తన గోదావరి స్లాంగ్ కు వస్తున్న కాంప్లిమెంట్స్ కు దాంక్స్ అంటున్నాడు.
అలాగే తనకు ఓ పండుగ వాతావరణం కనిపిస్తోందని, అన్ని ధియోటర్స్ నుంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయంటూ తనకే తనే స్వయంగా భజన చేసుకుంటున్నాడు. మరో రెండు రోజులు పోతేగానీ మీడియా ముందుకు రాలేము కాబట్టి ఈ విధంగా తన శాయశక్తులా ఈ చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ చిత్రంలో సిద్దార్దకు జంటగా ప్రణీత చేసింది. రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర చేసిన ఈ చిత్రం ద్వారా రాంబాబు అనే నూతన దర్శకుడు పరిచయమయ్యాడు.


Click it and Unblock the Notifications











