BB3FirstRoar.. యూట్యూబ్‌లో మార్మోగుతున్న బాలయ్య గర్జన
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే కేవలం బాలయ్య అభిమానుల్లోనే కాదు సగటు సినీ ప్రేక్షకుల్లోనూ తారాస్థాయి అంచనాలుంటాయి. మొదటిసారి వీరిద్దరు కలిసి గర్జించిన సింహ.. బాక్సాఫీస్‌పై దాడి చేసి రికార్డులను కొల్లగొట్టింది. ఆపై లెజెండ్ అంటూ మరోసారి రికార్డులు తిరగరాశారు. ఇక ముచ్చటగా మూడోసారి అలరించేందుకు సిద్దమయ్యారు. లాక్ డౌన్‌కు ముందు షూట్ చేసిన వారం రోజుల పుటేజ్ నుంచి బాలయ్య బర్త్ డే సందర్భంగా ఓ గిఫ్ట్ ఇచ్చాడు.
బాలయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మొదటి గర్జన ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. బాలయ్య లుక్స్, డైలాగ్ అదిరిపోయింది. బాలయ్య-బోయపాటి కాంబో అంటే ఆ మాత్రం ఉండాల్సిందేనని సామాన్య ప్రేక్షకులు సైతం అంటున్నారు. బాలయ్య డైలాగ్ డెలీవరీ ఓ రేంజ్ అనుకుంటే.. దానికి తగ్గట్టు తమన్ అందించిన నేపథ్య సంగీతం మరో లెవెల్‌లో ఉంది. ఈ ఫస్ట్ రోర్ యూట్యూబ్‌లో దుమ్ముదులుపుతోంది.

24 గంటలు తిరగకుండానే 3 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టింది. బాలయ్య బర్త్ డే సంబరాల్లో మునిగిన ఫ్యాన్స్.. మొదటి సింహా గర్జన మరింత కిక్కుని ఇస్తోంది. ఇక మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయబోతోన్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండటంతో షూటింగ్ ఇప్పట్లో ప్రారంభించేందుకు బాలయ్య సుముఖంగా లేరని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











