BB3 Update: బాలకృష్ణ ఫ్యాన్స్‌కు పండగే పండుగ..
బాక్సాఫీస్ బొనాంజా, నట సింహ నందమూరి బాలకృష్ణ 60వ పడిలోకి అడుగుపెడుతున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులకు పండుగలాంటి వార్తను అందించేందుకు బాలయ్య సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బోయపాటి శ్రీను రూపొందిస్తున్న సినిమా గురించి ఆసక్తికరమైన వార్తను అందించేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే..

క్రేజీగా బోయపాటి శ్రీను
తన అభిమాన హీరో బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు. తమ కాండినేషన్‌లో వచ్చే బాలకృష్ణ, బోయపాటి శ్రీను అంటే BB3 మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అందించేందుకు అంతా రెడీ చేసినట్టు తెలుస్తున్నది. జూన్ 9 తేదీ సాయంత్రం 7.30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు.

BB3 టైటిల్ ఇదే..
బాలయ్య జన్మదినం జూన్ 10వ తేదీన సాయంత్రం 7.09 గంటలకు తన మూవీకి సంబంధించిన వివరాలను అందించాలని నిర్ణయించారు. సినీ వర్గాల ప్రకారం.. BB3 సినిమా టైటిల్ మోనార్క్ అనే టైటిల్ విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అదే టైటిల్‌ను కన్ఫర్మ్ చేస్తారా లేక మరో టైటిల్‌ను అనౌన్స్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

బోయపాటి సినిమా పూర్తయ్యే వరకు
బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చే మూడో సినిమా లాక్‌డౌన్‌కు ముందు ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకొన్నది. తమ సెంటిమెంట్ ప్రకారం.. బాలయ్యతో బోయపాటి పోరాటాలు చేయించి సన్నివేశాలను చిత్రీకరించారు. శరవేగంగా సాగుతున్న ఈ షూటింగుకు కరోనావైరస్ బ్రేక్ వేసింది. ఇటీవల సినిమా వివరాలను బాలకృష్ణ వెల్లడిస్తూ.. బోయపాటి సినిమా పూర్తయ్యే వరకు ఎలాంటి సినిమాను అంగీకరించను. ఎందుకంటే గెటప్ అనేది సినిమాకు కీలకం. అందుకే సినిమా పూర్తయ్యేంత వరకు మరో సినిమాలో నటించను అని చెప్పారు.
Recommended Video

స్పెషల్ గెటప్‌లో
బాలకృష్ణను అభిమానులకు నచ్చే విధంగా చూపించడంలో బోయపాటి స్టైలే వేరు. ఈ చిత్రంలో ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఊహించని విధంగా బాలయ్యను అఘోరాగా చూపించబోతున్నారు. కథలో అదే కీలక మలుపు. బాలయ్య బాబు పాత్ర సరికొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు తెరపైన చూడగానే థ్రిల్ అవుతారు. అలాంటి క్యారెక్టర్‌ను బాలకృష్ణ కోసం డిజైన్ చేశాం. మా కాంబినేషన్‌కు ఉండే అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది అని బోయపాటి వెల్లడించారు.


Click it and Unblock the Notifications











