twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో: బీచ్ డ్రామా అంటున్న ఆర్జీవీ.. ఆఫీసర్ వేట ఎలావుందో చూశారా!

    |

    Recommended Video

    బీచ్ డ్రామా అంటున్న ఆర్జీవీ.. ఆఫీసర్ వేట ఎలావుందో చూశారా!

    నాగార్జున, ఆర్జీవీ కాంబినేషన్ లో చాలా కాలం తరువాత తెరకెక్కిన చిత్రం ఆఫీసర్. ముంబై మాఫియా నేపథ్యంలో ఆర్జీవీ ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కించారు. జూన్ 1 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేసింది. నాగార్జున ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడు. నాగ్, మాఫియా గ్యాంగ్ మధ్య వర్మ మంచి యాక్షన్ సన్నివేశాలని రూపొందించినట్లు తెలుస్తోంది. వర్మకు ఇటీవల సరైన హిట్ లేదు. ఈ నేపథ్యంలో ఆఫీసర్ చిత్రం విజయం సాధిస్తుందని ఈ దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. బీచ్ డ్రామా అంటూ ఈ చిత్రానికి సంబందించిన మరో టీజర్ విడుదల చేశారు.

    ఉత్కంఠభరిత సన్నివేశాలు

    ఉత్కంఠభరిత సన్నివేశాలు

    సౌండ్ ఎఫెక్ట్ అంటూ ఆదివారం రోజు రాంగోపాల్ వర్మ ఆఫీసర్ చిత్ర టీజర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో సన్నివేశాలు ఎంత ఉత్కంఠ భరితంగా ఉంటాయో ఈ టీజర్స్ చూస్తే తెలుస్తోంది. ఇందులో బ్యాగ్రౌండ్ సంగీత కూడా ఆకట్టుకుంటోంది.

    బీచ్ డ్రామా

    అదే తరహాలో నేడు బీచ్ డ్రామాగా అంటూ మరో టీజర్ విడుదల చేశాడు. బీచ్ లో నాగార్జున రౌడీలని ఛేజ్ చేసే సన్నివేశాలకు సంబందించినది ఈ టీజర్. చూస్తుంటే వర్మ ఈ సన్నివేశాల్ని రియాలిటీకి దగ్గరగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

    జోరుగా ప్రమోషన్స్

    జోరుగా ప్రమోషన్స్

    జూన్ 1 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల వేగం పెంచింది. నేడు హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించబోతున్నారు.

    పోలీస్ ఆఫీసర్ స్పూర్తితో

    పోలీస్ ఆఫీసర్ స్పూర్తితో

    ఈ చిత్రానికి కర్ణాటకకు చెందిన ఓ పోలీస్ అధికారి స్పూర్తితో తెరకెక్కించానని వర్మ ఇటీవలే ప్రకటించాడు. ఆఫీసర్ చిత్ర విషయంలో అనేక వివాదాలు మొదలవుతుండగా వర్మ ఈ క్లారిటీ ఇచ్చారు. నిజజీవితంలోని కీలక అంశాలని వర్మ పలుమార్లు చిత్రాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

    English summary
    BEACH DRAMA Experience OFFICER Sound. One more teaser from officer
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X