»   » "బాహుబలి" ని దాటే సినిమా తీయటమే నా జీవిత ధ్యేయం

"బాహుబలి" ని దాటే సినిమా తీయటమే నా జీవిత ధ్యేయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పై మాటలు అంటున్నది ఎవరో కాదు ...ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్. బాహుబలి రిలీజైన ఇన్ని రోజులు తర్వాత ఆయన ట్విట్టర్ సాక్షిగా ట్వీట్ చేస్తూ ఇలా స్పందించారు. ఆయన ట్వీట్ మీరే చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుఅలాగే..బాహుబలి సినిమా తీసి తెలుగు సినిమా స్ధాయిని అంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్లిన రాజమౌళి గారికి నా ధన్యవాదాలు అని చెప్తూ ఇలా ట్వీట్ చేసారు.చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే..


రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లను వసూలు చేసిన చిత్రాల క్లబ్‌లోకి చేరింది. తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.303 కోట్లను వసూలు చేసినట్లు సినిమా వర్గాలు అంచనా వేస్తున్నాయి.


దక్షిణాది చిత్రాల్లో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన 'రోబో' చిత్రం పేరిట ఉన్న రూ.290కోట్ల రికార్డును బాహుబలి బ్రేక్‌ చేసింది. హిందీలో విడుదలైన అనువాద చిత్రాల రికార్డుల సైతం బాహుబలి బ్రేక్‌ చేసింది.


Beating Baahubali Is My Lifetime Aim: Bandla Ganesh

బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం రూ.50 కోట్లను వసూలు చేసింది. శుక్రవారం విడుదలైన 'భజరంగీ భాయ్‌జాన్‌' చిత్రం కూడా బాహుబలిపై ప్రభావం చూపకపోవడం విశేషం.


English summary
Bandla Ganesh tweeted: "Making a movie that is bigger than Baahubali is my lifetime ambition. Surely I'll make it. Bless Me".
Please Wait while comments are loading...