హీరోయిన్ ను కొడితే అనుకున్న నటన వస్తుందా?
హీరోయిన్ పద్మప్రియను దర్శకుడు సామి కొట్టడం సిగ్గుచేటైన విషయమని సుప్రసిద్ధ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. సరిగా నటించడం లేదంటూ పద్మప్రియను సామి కొట్టిన విషయమై ఆయన తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. దర్శకులు నటులను ఎప్పుడూ కొట్టకూడదు. సదరు నటులనుంచి అనుకున్న నటనను రాబట్టుకునేందుకు దర్శకుడు వారిలో నమ్మకాన్ని కలిగించాలే తప్ప కొట్టకూడదు. ఇలా కొట్టడం మూలానా అనుకున్న నటన వస్తుందనుకోవడం తప్పు. వారు భయభ్రాంతులకు గురి కావడమే కాకుండా ఆ కాస్తా నటనను కూడా వారు ప్రదర్శించలేరు. పద్మప్రియ చక్కని నటి చాలా అద్భుతంగా నటిస్తుంది...అని ఆదూర్ గోపాలకృష్ణన్ అన్నారు.


Click it and Unblock the Notifications











