Honey Rose: వామ్మో హనీ రోజ్ బికినీ వేయనుందా.. రెమ్యునరేషన్ తో టెంప్టింగ్ ఆఫర్!

ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ కు సినిమాలతో సంబంధం లేకుండా మంచి క్రేజ్ అయితే లభిస్తోంది. ఇక మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్యూటిఫుల్ హీరోయిన్ హనీ రోజ్ కూడా ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా టాక్ ప్రకారమైతే అమ్మడికి బికినీలో కనిపించే ఒక ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇవ్వబోతున్నట్ల టాక్ వస్తోంది. అంతేకాకుండా హనీ రోజ్ కూడా ఆ ఆఫర్ కు టెంప్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

 మొదట్లో అక్కడే..

మొదట్లో అక్కడే..

హనీ రోజ్ మొదట కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు అందుకునే ప్రయత్నం చేసింది. ఇక మెల్లగా చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ ఆమె ఆ తర్వాత మీడియం రేంజ్ హీరోలతో అవకాశాలను అందుకుంటు వచ్చింది. మొదట్లో ఈ బ్యూటీ మలయాళం ఇండస్ట్రీలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. ఇక తర్వాత కన్నడ తమిళంలో కూడా అప్పుడప్పుడు అవకాశాల అందుకుంటూ వస్తోంది.

అప్పట్లో తెలుగు సినిమాలు కూడా..

అప్పట్లో తెలుగు సినిమాలు కూడా..

హనీ రోజ్ 2005లో బాయ్ ఫ్రెండ్ అనే ఒక మలయాళం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఇక తర్వాత ఈ బ్యూటీ తొందరగానే తెలుగులో కూడా బిజీ అవ్వాలని అనుకుంది. మొదట 2007లో ఈ బ్యూటీ తెలుగులో ఆలయం అనే ఒక సినిమా చేసింది. అయితే ఆ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు అయితే పెరగలేదు.

మంచి లవ్ స్టోరీలు

మంచి లవ్ స్టోరీలు

ఇక తర్వాత మళ్ళీ మలయాళం ఇండస్ట్రీలోనే బిజీగా మారిపోయింది. అక్కడే ఆమె మీడియం రేంజ్ హీరోలతో మంచి లవ్ స్టోరీలు ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. అలాగే మధ్య మధ్యలో కొన్ని స్పెషల్ సాంగ్స్ తో కూడా మంచి గుర్తింపును అందుకునే ప్రయత్నం చేసింది. ఇక 2014లో వరుణ్ సందేశ్ నటించిన ఈ వర్షం సాక్షిగా అనే సినిమా ద్వారా మళ్ళీ తెలుగులో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు.

ఆ సినిమాతో పెరిగిన ఆఫర్స్

ఆ సినిమాతో పెరిగిన ఆఫర్స్

ఇక హనీ రోజ్ గత రెండేళ్ల వరకు కూడా ఏ ఇండస్ట్రీలోకి వెళ్లకుండా మలయాళం లోనే సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. అక్కడ ఈ బ్యూటీకి కొన్ని సినిమాలు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ముఖ్యంగా మాన్ స్టర్ సినిమా హనీ రోజ్ ను ఇతర ఇండస్ట్రీలో కూడా వైరల్ అయ్యేలా చేసింది. దీంతో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలని హనీ రోజ్ అడుగులు వేస్తోంది.

బాలయ్య సినిమాతో క్రేజ్

బాలయ్య సినిమాతో క్రేజ్

ఇక ఈ ఏడాది మొత్తానికి హనీ రోజ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చింది గతంలో ఈ బ్యూటీ తెలుగు సినిమాలు చేసింది అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మంచి క్రేజ్ అందుకుంటుంది. వీర సింహారెడ్డి సినిమాలో ఆమె చేసిన పాత్ర బాగానే క్లిక్ అయింది. హనీ రోజ్ అందానికి తెలుగు కుర్రాళ్ళు అయితే ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ బ్యూటీ ఫోటోలోలతో ప్రతిరోజు ట్రేండింగ్ అవుతూనే ఉంది.

బికినీలో కనిపిస్తుందా?

బికినీలో కనిపిస్తుందా?

ఇక ప్రస్తుతం కూడా ఈ బ్యూటీకి చాలా అవకాశాలు పెరుగుతున్నట్లు సమాచారం. అయితే లేటెస్ట్ గా వైరల్ అవుతున్న ఒక టాక్ గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ కావాల్సిందే. ఈ బ్యూటీ కి బికినీలో కనిపించే ఒక ఆఫర్ వచ్చినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. హనీ రోజ్ నార్మల్ గా ఒక గ్లామర్ డ్రెస్ లో కనిపిస్తేనే కుర్రాళ్ళు ఫిదా అయిపోతారు. ఇక ఆమె బికినీలో కనిపించింది అంటే బాక్సాఫీస్ బ్లాస్ట్ అవుతుంది అని కామెంట్ చేస్తున్నారు.

టెంప్ట్ అయ్యేలా రెమ్యునరేషన్ ఆఫర్

టెంప్ట్ అయ్యేలా రెమ్యునరేషన్ ఆఫర్

కోలీవుడ్ ఇండస్ట్రీలో నుంచి ఒక ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ నుంచి హనీ రోజ్ కు ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అది లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ అని కూడా తెలుస్తోంది. అయితే అందులో కొన్ని సన్నివేశాలు బికినీలో కూడా కనిపించాల్సి ఉంటుంది అని మేకర్స్ ముందుగానే ఆమెకు క్లారిటీ ఇచ్చారట.

అంతేకాకుండా ఆమెకు కోట్లల్లో భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా ఆ విషయంలో మాత్రం హనీ రోజ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. కానీ రెమ్యునరేషన్ మాత్రం టెంప్ట్ అయ్యేలా ఉంది అని తెలుస్తోంది. మరి ఈ బ్యూటీ ఆ ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X