ఆయన మగతనంతో నాకేంటి సంబంధం అంటూ.. సురేఖవాణి వీడియో.. అతన్ని చూపించి మరీ..
క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే ఒకప్పుడు మాత్రం సినిమాల్లో తప్పితే బయట ప్రపంచంలో ఎక్కువగా కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా హడావిడి పెరిగిపోవడంతో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు జనాలకు దగ్గరవుతున్నారు. ఇక ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన వారిలో సురేఖ వాణి ఒకరు. ఇక ఆమె సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన మగతనంతో నాకేంటి సంబంధం అంటూ సురేఖ వాణి షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

చిన్నతనం నుంచి..
సురేఖ వాణి చిన్నతనం నుంచి నటనపై ఎంతగానో ఆసక్తిని పెంచుకుంది. ఆమె మొదట్లోనే అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో హోస్ట్ గా కూడా పాల్గొంది. ఎనిమిదవ తరగతి లోనే విజయవాడలోనే ఒక ప్రాంతీయ ఛానల్లో సురేఖవాణి ఒక పిల్లల కార్యక్రమానికి హోస్ట్ వ్యవహరించింది. అప్పుడే ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ చదువు కోసం మొదట్లోనే సినిమాల్లోకి రావాలని అనుకోలేదు.

భర్తతో అలా..
సురేఖ వాణి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత కొన్ని కార్యక్రమాలలో హోస్ట్ గా చేస్తూ చాలా బిజీగా మారిపోయింది. అలాగే ఆ తర్వాత మాటీవీలో భర్తతో కలిసి కొన్ని షోలు చేశారు. హార్ట్ బీట్ అని వివిధ రకాల కార్యక్రమాలలో కూడా యాంకర్ గా చేశారు. భర్త సురేష్ తేజ కాన్సెప్ట్ లో వచ్చిన మొగుడ్స్ పెళ్లామ్స్ అనే టెలివిజన్ షోకు కు కూడా ఆమె యాంకర్ గా కనిపించారు. కొన్నేళ్ల క్రితమే సురేఖవాని భర్త మరణించాడు.

టెలివిజన్ రంగంలో
ఇక సురేఖ వాణి కొన్నాళ్లపాటు టెలివిజన్ రంగంలో బాగానే బిజీ అయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. అక్కడ మరింత బిజీగా మారిపోయింది. ఎక్కువగా హీరోల సిస్టర్ వదిన క్యారెక్టర్లలో ఆమె కనిపించింది. శీను గాడు చిరంజీవి ఫ్యాన్ అనే సినిమాతో 2005 లో ఆమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక తర్వాత భద్ర, బొమ్మరిల్లు, దుబాయ్ శీను, రెడీ ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి సినిమాలతో మరింత బిజీ అయ్యారు.

పాత్ర ఏదైనా సరే..
కేవలం తెలుగులోనే కాకుండా సురేఖ వాణి తమిళంలో కూడా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. వీలైనంతవరకు ఎక్కువగా కామెడీ టైమింగ్ ఉండే పాత్రలలోనే ఆమె కనిపించారు. అంతేకాకుండా ఒక ఫ్యామిలీ వుమెన్ గా ఆమె కొన్ని పాత్రలలో కూడా మంచి ఎమోషన్ ను పండించారు. పాత్ర ఏదైనా సరే సురేఖ వాణి డిఫరెంట్ టైమింగ్ తో ఎంతో ఆకట్టుకుంటూ మంచి గుర్తింపు అందుకుంది.

గ్లామరస్ లుక్స్
అయితే సోషల్ మీడియాలో కూడా సురేఖ వాణి రేంజ్ రోజురోజుకు మరింత పెరిగిపోతుంది. ఆమె గ్లామరస్ లుక్స్ తో కూడా షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. పాతికేళ్ళ వయసున్న కూతురు ఉన్నా కూడా సురేఖ వాణి వయసు మాత్రం చాలా చిన్నది అని కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆమె ఆ రేంజ్ లో గ్లామర్ తో షాక్ ఇస్తూ ఉంటుంది.

ఆయన మగతనం నాకేంటి..
ఇక అప్పుడప్పుడు సురేఖవాణి కొన్ని స్పెషల్ వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గానే తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో కూడా వైరల్ అయింది. పొలిటికల్ లీడర్ వైఎస్ షర్మిల ఆ మధ్య చెప్పిన ఒక డైలాగ్ బాగా వైరల్ అయింది. అయితే సురేఖ వాణి దాని ఇన్ స్టాగ్రామ్ లో దాన్ని రీల్ చేశారు. "నేను ఆయనను అనలేదు. ఆయన మగతనంతో నాకు ఏమి సంబంధం అంటూ పక్కనే ఉన్న మరో వ్యక్తిని కూడా మీ వీడియో లోకి లాగింది. అది ఆయన భార్య చూసుకోవాలి కదా.." అంటూ సురేఖవాణి తన డిఫరెంట్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications











