Bedurulanka 2012 Teaser అంతా బ్రహ్మం గారు చెప్పినట్టే.. హీరో కార్తీకేయ, నేహా శెట్టి కెమిస్ట్రీ అదుర్స్!
RX 100 ఫేమ్, యువ హీరో కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం బెదురులంక 2012. యుగాంతం అనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. సీ యువరాజ్ చిత్ర సమర్పకులు. నూతన దర్శకుడు క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత దుర్గారావు, నటీమణులు రాజేశ్వరి, అనితా నాగ్, దివ్య నార్ని, నటులు కిట్టయ్య తదితరులు పాల్గొన్నారు.బెదురులంక టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో కార్తీకేయ మాట్లాడుతూ...
తప్పనిసరిగా హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఎదురు చేస్తున్న సమయంలో బెదురులంక సినిమా స్క్రిప్టుతో క్లాక్స్ కలిశాడు. RX 100 డైరెక్టర్ అజయ్ భూపతి రెఫరెన్స్ ఇవ్డంతో కథ విన్నాను. ఆ తర్వాత ఇలాంటి కథ కోసమే వెయిట్ చేస్తున్నాననిపించింది. ప్రేక్షకులను తప్పకుండా థియేటర్‌కు రప్పించే సినిమా అవుతుందనే నమ్మకం కలిగింది. తప్పకుండా ఈ సినిమా మాట్లాడటమే కాకుంబా బ్లాక్ బస్టర్ అవుతుందనే కాన్ఫిడెన్స్ కలిగింది. ఇటువంటి సినిమా చేయడానికి నమ్మే నిర్మాత కావాలి. ఈ కథలో నేను చేయగలనని నమ్మి, సినిమాకు కావలసినట్టు చేసిన మా నిర్మాత బెన్నీ గారికి థాంక్స్. మంచి అభిరుచి ఉన్న ఇటువంటి నిర్మాతలు వస్తే డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడానికి మాకు అవకాశం వస్తుంది అని అన్నారు.

నేహా శెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత బెన్నీ గారు, దర్శకుడు క్లాక్స్ గారికి థాంక్స్. నా లాస్ట్ సినిమా డీజే టిల్లు. అందులో నా క్యారెక్టర్ రాధికాను మీరు చాలా చాలా ప్రేమించారు. బెదురులంక 2012లో నా క్యారెక్టర్ చిత్రను కూడా అదే విధంగా ప్రేమిస్తారు. మా టీజర్ లాంచ్ చేసిన విజయ్ దేవరకొండకి థాంక్స్'' అని అన్నారు.
అయితే బెదురులంక సినిమా టీజర్ విడుదలైన వెంటనే మంచి రెస్పాన్స్‌ను కూడగట్టుకొన్నది. కొద్ది గంటల్లోనే ఈ ట్రైలర్ 1 మిలియన్ వ్యూస్ సాధించడమే కాకుండా 2 మిలియన్ల వ్యూస్‌కు చేరువైంది. ఈ కథ వెనుక బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుందనే నమ్మకం చిత్ర యూనిట్‌లో కనిపించింది.


Click it and Unblock the Notifications











