»   » బీర్‌ పొంగిస్తూ మహేష్ బాబు ఫ్యాన్స్ హల్ చల్

బీర్‌ పొంగిస్తూ మహేష్ బాబు ఫ్యాన్స్ హల్ చల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘శ్రీమంతుడు' సినిమాలో మహేష్ బాబు మద్యం అమ్మడాన్ని అడ్డుకుంటాడు. తాగు బోతుల వల్ల ఊరు నాశనం అవుతోందంటూ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి వారిని తరిమి కొడతాడు. సినిమా క్లైమాక్స్ లో కూడా మహేష్ బాబు బీర్ ఫ్యాక్టరీని నాశనం చేస్తాడు.

అయితే నిజ జీవితంలో మాత్రం మహేష్ బాబు అభిమానులు అందుకు పూర్తి విరుద్దంగా ఉన్నారు. మహేష్ బాబు ‘శ్రీమంతుడు' పోస్టర్లపై బీర్ పొంగిస్తూ అభిషేకం చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇది ఎక్కడ జరిగింది అనేది తెలియడం లేదు. ఈ ఫోటో చూసి పలువురు విస్మయం చెందుతున్నారు. హీరోల పోస్టర్లకు పాలాభిషేకం, నీళ్ల అభిషేకం చేయడం చూసాం కానీ....ఇలా బీర్ అభిషేక్ చేయడం ఇదే తొలిసారి.


'Beer Abhishekam' on Srimanthudu poster

ఆ మధ్య బాహుబలి సినిమా విషయంలోనూ ప్రభాస్ అభిమానులు వింతగా ప్రవర్తించారు. బాహుబలి సినిమాలో ప్రభాస్ జంతు బలిని అడ్డుకుంటాడు. తన రక్తం చిందిస్తాడు. కానీ నిజ జీవితంలో ప్రభాస్ అభిమానులు కొందరు బాహుబలి థియేటర్ల వద్ద మేకను బలి ఇవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది.


శ్రీమంతుడు సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. జి మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సొంత ఊరుకు మంచి చేయాలనే కాన్సెప్టుతో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

English summary
We have generally seen Fans and admirers bathing their hero’s cut outs with milk and water. For the first time, they made Mahesh Babu get wet in Beer.
Please Wait while comments are loading...