Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
రామ్‌కు బీర్‌తో అభిషేకం.. క్రేజీ అన్న ఛార్మీ.. మామూలుగా ఉండదు మరి
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తాజాగా నటించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్ నటించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. గురువారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో రామ్ సహా చిత్ర బృందం ఖుషీగా ఉంది.
కెరీర్లో భారీ హిట్ సాధించాలన్న కసితో రామ్ ఈ సినిమా కోసం ఎంతో కష్ట పడ్డాడు. లుక్, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుని సరికొత్తగా ట్రై చేశాడు. ఈ సినిమాలో రామ్ నటనకు, అతడి తెలంగాణ స్లాంగ్, బాడీ లాంగ్వేజ్‌లకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే పూరీ కొత్త పాయింట్‌ను తీసుకొచ్చినప్పటికీ టేకింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదన్న టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసుకుని తీశారనిపించిందని రివ్యూలు వచ్చాయి.
ఇక, ఈ సినిమా ఫలితంపై రామ్ అభిమానులు సైతం ఎంతో సంతోషంగా ఉన్నారు. తమ అభిమాన హీరోకు హిట్ వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే విశాఖపట్నంలోని జగదాంబ థియేటర్ దగ్గర ఓ అభిమాని రామ్ పోస్టర్‌కు బీరుతో అభిషేకం చేశాడు. మరో ఇద్దరు ఫ్యాన్స్ పోస్టర్ మీద పాలు పోస్తుండగా.. అతడు మాత్రం బీరును పొంగించాడు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీన్ని తన ట్విట్టర్లో షేర్ చేసిన ఛార్మీ 'ఇది క్రేజీ' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ వీడియో తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.
This is craaazyyyyyyyyyyyyy https://t.co/Yw1a148mwR
— Charmme Kaur (@Charmmeofficial) July 18, 2019