సందీప్ కిషన్ ‘బీరువా’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారైంది
హైదరాబాద్: ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన బ్యానర్ ఆనంది ఆర్ట్స్ క్రియేషన్ష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘బీరువా'.
యంగ్ హీరో సందీప్ కిషన్, సురభి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిక్మాత రామోజీరావు నిర్మిస్తున్నారు. కణ్మణి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఎస్.ఎస్.థమన్ సంగీత సారథ్యంలో రూపొందించిన ఈ ఆడియోను డిసెంబర్ 24న చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయ్యబోతున్నారు.

త్వరలోనే ఈచిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. నరేష్, ముఖేష్ రుషి, చలపతిరావు, అజయ్, సప్తగిరి, వేణు, షకలక శంకర్, గుండు సుదర్శన్, శివన్నారాయణ, అనితా చౌదరి, అనీసా సింగ్, సంధ్య తదితరులు ఇతర తారాగణంగా నటించారు.
ఈ చిత్రానికి డాన్స్: రాజు సుందరం, బాబా భాస్కర్, శేఖర్, ఫైట్స్: వెంకట్, పాటలు: శ్రీమణి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, ఆర్ట్: సాహి సురేష్, ఎడిటింగ్: గౌతం రాజు, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు, లైన్ ప్రొడ్యూసర్: సుబ్రత్ రాయ్, నిర్మాత: రామోజీరావు, కథ-దర్శకత్వం: కణ్మణి.


Click it and Unblock the Notifications











