»   » జెనీలియాపై మనసు పారేసుకొన్నా.. డేటింగ్ చేశా.. విరాట్ కోహ్లీ.. అనుష్క పరిస్థితి ఏంటీ..

జెనీలియాపై మనసు పారేసుకొన్నా.. డేటింగ్ చేశా.. విరాట్ కోహ్లీ.. అనుష్క పరిస్థితి ఏంటీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రికెటర్లకు, సినీతారలకు అఫైర్లనేటివి చాలా సర్వసాధారణమైనవి. చాలా మంది క్రికెటర్లకు, సినీ తారలకు లింకులు ఉన్న సంగతి తెలిసిందే. తాజా అలాంటి అఫైర్లలో ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మకు మధ్య ఉన్న అఫైర్ ప్రస్తుతం హాట్ టాపిక్. అయితే అనుష్క శర్మతో లవ్‌లో పడటానికి ముందు విరాట్ కోహ్లీ మరో తారపై మనసు పాడేసుకున్నాడట. ఆమె ఎవరంటే రితేష్ దేశ్‌ముఖ్ సతీమణి జెనిలీయా దేశ్‌ముఖ్.

విరాట్ పాత ఇంటర్వ్యూ వైరల్

విరాట్ పాత ఇంటర్వ్యూ వైరల్

విరాట్ కోహ్లీ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో జెనీలియా డిసౌజా అంటే తనకు చాలా ఇష్టం అని, ఆమె చాలా అందంగా ఉంటుంది అని కోహ్లీ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు.

జెనీలియా అందంగా ఉంటుంది..

జెనీలియా అందంగా ఉంటుంది..

అప్పటికే జెనిలీయా జానే తూ యా జానే నా అనే చిత్రంతో మంచి హిట్ కొట్టి ఫామ్‌లో ఉన్నది. ఆ సందర్బంగా ఓ వీడియో జాకీ అడిగిన ప్రశ్నకు కోహ్లీ సమాధానమిస్తూ జెనీలియా చాలా అందంగా ఉంటుంది. ఆమెతో కొద్ది సేపు డేటింగ్ చేశాను. ఒక సందర్భంలో ఆమెను కొన్ని క్షణాలు చూసి .. వెంటనే సిగ్గుతో అక్కడ నుంచి పారిపోయాను అని కోహ్లీ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం.

అనుష్క, కోహ్లీల అఫైర్

అనుష్క, కోహ్లీల అఫైర్

ఆ తర్వాత కోహ్లీ జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లలో దుమ్ము రేపడం, అనతికాలంలోనే భారత జట్టులో కీలక సభ్యుడిగా మారడం జరిగిపోయాయి. ఇండియాలోనే టాప్ క్రికెటర్‌గా బ్రాండ్ సంపాదించుకొన్న కోహ్లీ, అనుష్కశర్మలు ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. అంతకు ముందే రితేష్‌తో జెనీలియాకు అఫైర్ ఉండటం, ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకొని చకచకా ఇద్దరు పిల్లలకు తల్లి, తండ్రులుగా మారారు.

జోరుగా అనుష్క, కోహ్లీ రొమాన్స్

జోరుగా అనుష్క, కోహ్లీ రొమాన్స్

విరాట్ కోహ్లీ, అనుష్కల జంట ప్రస్తుతం సూపర్ హిట్‌గా నిలిచింది. కోహ్లీ కెరీర్ గ్రాఫ్ దూసుకెళ్లడం, అనుష్క నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలువడంతో వారిద్దరూ వారి వారి రంగాల్లో సూపర్ స్టార్లుగా మారారు. వారు వీలు చిక్కితే ఎక్కడో ఒక చోట ప్రేమ పక్షుల్లా వాలి పోతున్నారు. వారి ప్రేమ కథ గురించి పత్రికలు ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి.

గాయపడిన కోహ్లీకి పరామర్శ

గాయపడిన కోహ్లీకి పరామర్శ

తాజాగా గాయాల బారిన కోహ్లీ ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులో విశ్రాంతి తీసుకొంటున్నాడు. గాయపడిన కోహ్లీని సోమవారం అనుష్క శర్మ బెంగళూరుకు వెళ్లి పరామర్శించింది. వారిద్దరు కలిసి బెంగళూరులో చాలా క్వాలిటీ సమయాన్ని గడిపినట్టు వార్తలు వస్తున్నాయి. వారిద్దరు కలిసి వెళ్తున్న చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

English summary
An old interview of Virat Kohli is now going viral. Now Virat Kohli and Anushka Sharma are in a relationship. But before our favourite cricketer found love in the Anushka, he was an admirer of another actor. Virat admitted that he found Genelia D'Souza (now Deshmukh) "cute."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu