బాబీ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఆ మలయాళ స్టార్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్.. NBK109 స్టోరీ లీక్?

ప్రస్తుతం సీనియర్‌ నటుడు బాలకృష్ణ జోరు.. ఇతర ఏ హీరో అందుకోలేకపోతున్నారు. ఆయన వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు చేస్తున్న భగవంత్ కేసరి సినిమా అవ్వగానే.. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వివరాళ్లోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ.. :తండ్రి ఎన్టీఆర్ నటనను అందిపుచ్చుకుని ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎదిగారు. తన ప్రతిభ, నటనతో ప్రేక్షకులను మెప్పించి భారీ అభిమాగణాన్ని సంపాదించుకున్నారు. అరవై ఏళ్ల వయసులోనూ హీరోగా అదరగొడుతున్నారు. యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ... సినిమాలు, ఓటీటీ టాక్ షో అంటూ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. గత రెండేళ్లలో అఖండ, వీరసింహారెడ్డి అంటూ బ్యాక్ టు బ్యాక్ గ్రాండ్ సక్సెస్ లను అందుకున్నారు.

Behind A star Malayala hero in Balakrishna Bobby movie

ఇప్పటికే సూపర్ రెస్పాన్స్.. :ప్రస్తుతం ఫన్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో భగవంత్‌ కేసరి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. బాలయ్య సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రం అక్టోబర్‌19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

బాబీతో సినిమాతో.. :ఈ చిత్రం తర్వాత దర్శకుడు బాబీతో మరో భారీ ప్రాజెక్ట్‌ను చేయనున్నారు. NBK109 టైటిల్ రానున్న ఈ చిత్రం పోస్టర్‌తోనే సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. బాలయ్య ఈ చిత్రంలో ఎలా కనిపించబోతున్నారా, ఎలాంటి పాత్రతో రానున్నారు, కథ ఏంటి వంటి ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే ఇప్పుడీ సినిమా గురించి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

Behind A star Malayala hero in Balakrishna Bobby movie

సరికొత్తగా కాకపోతే మళ్లీ అలానే.. :ఈ సినిమాలో బాలయ్యను సరికొత్తగా చూపించబోతున్నారట. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుందని సమాచారం అందింది. బాలయ్య క్లాసీ లుక్‌లో కనిపిస్తారట. ఇంకా ఈ మూవీ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ కూడా ఉంటుందని అంతా అంటున్నారు. ఆలాగే బాలయ్య గత కొంతకాలంగా ఎక్కువగా ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబీ సినిమాలోనూ డ్యూయెల్ రోల్ లో కనిపిస్తారట.

Behind A star Malayala hero in Balakrishna Bobby movie

మల్టీస్టారర్ గా మలయాళ హీరోతో... :ఇంకా ఈ సినిమాను వీలైతే మల్టీస్టారర్ గా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగ్గట్టే కథను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. మలయాళం స్టార్ హీరో కూడా ఇందులో నటిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే ఆ కథనాయకుడి పేరును కూడా అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది. ఇక బాలకృష్ణ సరసన సంయుక్త మేనన్‌ హీరోయిన్ గా కనిపించనుందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడామెనే ఫైనలైజ్ చేయనున్నారని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేయాలని మూవీటీమ్ సన్నాహాలు చేస్తోందట.

More from Filmibeat

Read more about: balakrishna anil ravipudi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X