అప్పలరాజు వెనక్కి వెళ్ళటం వెనక వర్మ స్ట్రాటజీ!?

By Srikanya

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అప్పలరాజు చిత్రం మొదట సంక్రాంతికి విడుదల అన్నా ఇప్పుడది ఒక వారం వెనక్కి వెళ్ళిపోయింది. దీనికి కారణం అంతా చిత్రం షూటింగ్ లేటవటమేనని నిర్మాతతో సహా చెప్తున్నారు. అయితే అది నిజం కాదని, వర్మ కావాలనే ఈ చిత్రాన్ని వెనక్కి నెట్టాడని ఫిల్మ్ జనాలు గుసగుసలాడుతున్నారు. దానకి కారణం మొదట వర్మకు ఇష్టమంటూ చెప్పుతున్న రవితేజ, వర్మ శిష్యుడు హరీష్ శంకర్ డైరక్షన్ లో విడుదల అవుతున్న చిత్రం మిరపకాయ సంక్రాంతికి విడుదలకావటంతో దానికి తనే పోటీ ఇవ్వటం ఎందుకనేది ఒక కారణం అయితే, అసలు కారణం..సంక్రాంతికి తన చిత్రం విడదల అయితే ఆ చిత్రం పబ్లిసిటి ప్రత్యేకంగా చేయటం కష్టమని, సంక్రాంతికి ఏమి చేసినా గుంపులో గోవిందంలా కలిసిపోతుందని వర్మ భావించే వాయిదా వేసాడని చెప్పుకుంటున్నారు.

ఇక ఈ చిత్ర కథ ప్రకారం...అమలాపురం అప్పల్రాజుకి సినిమాయే లోకం. విడుదలైన ప్రతి సినిమా చూడాల్సిందే. అందులోని కథనీ, హీరోల యాక్షన్నీ, డైరక్టర్లు తీసిన విధానాన్నీ చీల్చి చెండాడాల్సిందే. ఆ దర్శకుల కంటే తనెంత బాగా తీసేవాణ్నో కనబడ్డ ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిందే. ఇక తన మీద తనకు నమ్మకం పెరిగిపోయాక హైదరాబాద్‌ వచ్చేసి ఫిల్మ్‌ నగర్లో వాలిపోయాడు అప్పల్రాజు. ఆ తరవాత అతని సినిమా కల ఏ విధంగా నెరవేరిందో వెండి తెరపై చూడాల్సిందే. అప్పల్రాజు పాత్రలో సునీల్‌ కనిపిస్తాడు. ఇక స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్‌, కృష్ణుడు, వేణుమాధవ్‌, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్‌ వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X