twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ 5 కోట్ల వెనక్కి.. (డమరుకం వ్యవహారంలో పచ్చినిజాలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా వాయిదా మీద వాయిదాలు పడ్డ కింగ్ నాగార్జున నటించిన 'డమరుకం' వ్యవహారం వెనక పచ్చినిజాలు బయటకు లీకయ్యాయి. ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఆర్థిక కారణాల వల్లనే ఈ సినిమా వాయిదా పడినట్లు స్పష్టం అవుతోంది.

    ఈ నెల 10న సినిమా ఫైనల్ గా విడుదలవ్వాల్సి ఉండగా....రూ. 10 కోట్ల లోటు మూలంగా వాయిదా పడింది. ప్రముఖ సినీ ఫైనాన్సియర్ సత్య రంగయ్య తనకు రావాల్సిన రూ. 10కోట్ల కోసం పేచీ పెట్టాడని, సినిమా విడుదల కాకుండా చేసాడని తెలుస్తోంది. నిర్మాత దగ్గర అంత డబ్బు లేక పోవడంతో నాగార్జున తాను తీసుకున్న రూ. 5 కోట్లు వెనక్కి ఇచ్చేసాడని, యూఎస్ నుంచి రావాల్సిన ఫండ్స్ వస్తే మ్యాటర్ సెటిల్ చేద్దామని ట్రై చేసినా అవి అందక పోవడంతో ఈ నెల 10న సినిమా విడుదల కాలేదని అంటున్నారు. ఇప్పుడు అన్నీ సద్దు మనగడంతో ఈ నెల 23న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

    డమరుకం చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించగా, ఆర్ వెంకట్ నిర్మించారు.. వెయ్యి సంవత్సరాల తర్వాత అంధకాసురుడు మళ్లీ పుట్టి పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, అగ్ని, నీరును తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని, ప్రపంచాన్ని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. త్రిమూర్తుల్లో ఒకరైన శివుని సహాయంతో ఒక సామాన్య వ్యక్తి ఆ రాక్షసుడితో ఎలా పోరాడాడు, ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేది ఈచిత్రం కథ. నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, రవి శంకర్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటించారు.

    English summary
    Behind the facts of Nag's Damarukam issue: Sources say a noted financier Satya Rangaiah has to get his money. Buzz is that Nagarjuna gave back Rs 5 crores from his remuneration. It is heard that the makers were expecting funds from US but that didn’t come on time and so it got postponed. But now they have announced release date as November 23rd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X